విదేశీ విద్యాపథకానికి దరఖాస్తుల స్వీకరణ

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్ర అల్పసంఖ్యాకవర్గ సంక్షేమ శాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనారిటీ (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీల)విద్యార్థుల నుంచి ముఖ్యమంత్రి విదేశీ విద్యాపథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అల్పసంఖ్యాకవర్గాల జిల్లా అధికారి మోహన్‌సింగ్‌ తెలిపారు.

ఈ పథకం ద్వారా పేద మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం, ఒక వైపు విమాన చార్జీల కింద రూ.60 వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ (ఇంజనీరింగ్‌)లో 60 శాతం మార్కులు ఉండి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేయాలనుకునేవారు, పీజీలో 60 శాతం మార్కులు పొంది పీహెచ్‌డీ  చేయాలనుకునేవారు పథకానికి అర్హులని తెలిపారు.

చదవండి: National Scholarship: జాతీయ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థుల ఎంపిక

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలములో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన మైనారిటీ విద్యార్థులు www.telanganaepass.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 8 అని పేర్కొన్నారు. సంభందిత దరఖాస్తు ఫారంల హార్డ్‌ కాపీలు జిల్లా అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

#Tags