Admissions: గ్రంథాలయశాస్త్ర సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: అరండల్‌పేట 12/3లోని వావిలాల గ్రంథాలయసంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్‌ కోర్సు (సీఎల్‌ఐఎస్సీ)కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్‌ దోనె రాంబాబు న‌వంబ‌ర్ 3న‌ ఓప్రకటనలో తెలిపా రు.

ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై, 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులని తెలిపారు. ఐదు నెలల కాల వ్యవధి గల కోర్సులో తెలుగు, ఇంగ్లిషు మీడియంలో బోధన ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంస్థ చిరునామాకు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 93962 38946 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

చదవండి:

Admissions: జర్నలిజం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

KL University: ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష వివ‌రాలు

#Tags