Diet Charges for Govt Hostels: 40% పెరిగిన డైట్, కాస్మెటిక్‌ చార్జీలు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థుల డైట్, కాస్మెటిక్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ న‌వంబ‌ర్‌ 1న జారీ చేశారు. ఏడేళ్ల తర్వాత ఈ చార్జీలను 40శాతం మేర పెంచగా, ఇవి నవంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

చార్జీల పెంపు పట్ల మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎన్‌.శ్రీధర్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల విద్య జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సీహెచ్‌.బాలరాజు, కె.యాదయ్య, పి.రుషికేశ్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, గురుకుల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మధుసూదన్, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ జనార్దన్‌ వేర్వేరు ప్రకటనల్లో న‌వంబ‌ర్‌ 1న హర్షం వ్యక్తం చేశారు. 

చదవండి: TGPSC Group 1 Jobs: ఈ రెండు కేటగిరీల్లో తీవ్ర పోటీ!.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది పోటీ!

సీఎంను కలసి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి సీతక్క

రాష్ట్రంలోని హాస్టల్‌ విద్యా ర్థులకు పెంచిన డైట్, కాస్మెటిక్‌ చార్జీలు గ్రీన్‌చా నల్‌ ద్వారా చెల్లిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పెరిగిన డైట్‌ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లకు, హాస్టల్‌ సిబ్బందికి ఉందని చెప్పారు.

విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల విద్యారంగ సమస్యలు త్వరిత గతిన పరిష్కారం అవుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.  ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్‌ చార్జీలను పెంచినందుకు రేవంత్‌రెడ్డిని కలిసి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.  

#Tags