UPSC Civils Ranker Story : ఫెయిల్యూర్స్‌ ఎదురైనా కుంగిపోకుండా.. ముచ్చటగా మూడో ప్ర‌య‌త్నంలో.. సివిల్స్‌లో కొట్టానిలా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో విజ‌యం సాధించాలంటే.. అనుకున్నంత ఈజీ కాదు. దీనికి క‌ఠోర ప్రిప‌రేష‌న్‌.. ఉంటే గానీ ఇందులో స‌క్సెస్ కాలేము.

ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రీక్ష‌లో మూడో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో సివిల్స్ 346 ర్యాంకు సాధించింది తెలంగాణ‌కు చెందిన‌ నంద్యాల చేతన రెడ్డి. ఈ నేప‌థ్యంలో నంద్యాల చేతన రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేపథ్యం :
మా అమ్మనాన్న ఇద్ద‌రు వైద్యులు. నాన్న ఎన్‌వీ నర్సింహారెడ్డి. ఈయ‌న‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా ప‌నిచేస్తున్నారు. అమ్మ కవితారెడ్డి. ఈమె ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు.

☛ IPS Officer Success Story : ఇందుకే 16 ఉద్యోగాలకు భాయ్ భాయ్ చెప్పా..కానీ..

చిన్నప్పటి నుంచే..
సివిల్స్‌ సాధించాలని చిన్నప్పటి లక్ష్యంగా పెట్టుకున్నాను. డిబేట్‌లో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. పోటీ పరీక్షలు రాయడం.. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడం చిన్నప్పటి నుంచే అలవడింది.  హైదరాబాద్‌ బిట్స్‌లో ఈసీఈ పూర్తి చేసి బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సెమీ కండక్టర్‌ విభాగంలో ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. రెండుసార్లు ప్రిలిమ్స్‌ దాకా వెళ్లాను. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంకు సాధించాను.

☛ APPSC Group2 Top Success Tips in Telugu : భ‌యం వ‌ద్దు.. ఇలా చ‌దివితే గ్రూప్‌-2 ఉద్యోగం కొట్టడం ఈజీనే..

నా ప్రిపరేషన్ ఇలా..

సివిల్స్‌ సాధించే క్రమంలో ఫెయిల్యూర్స్‌ ఎదురవుతాయి. వాటికి భయపడొద్దు. బ్యాక్‌ ప్లాన్‌ ఉంటే చాలా మంచిది. ప్రిలిమ్స్‌ కోసం 10 నుంచి 15 మాక్‌ టెస్టులు రాసేదాన్ని. రాసిన ప్రతి పేపరును తిరగేసి తప్పులను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకున్నాను. ఇలా చేయడం ద్వారా తప్పులు పునరావృతం కాలేదు. నిబద్ధత, క్రమశిక్షణతో చదివాను. నా ఆప్షనల్‌ సోషయాలజీ. చాలామంది సివిల్స్‌ రాసేందుకు ఇష్టమున్నా.. కష్టమని వెనక్కి తగ్గుతుంటారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న గోల్‌ సాధించవచ్చు. ప్రధానంగా మానసికంగా ఫిట్‌గా ఉండాలి. ఫెయిల్యూర్స్‌ ఎదురైనా కుంగిపోకూడదు. సమయపాలన చాలా ముఖ్యం. నిత్యం న్యూస్‌ పేపర్లు చదవాలి.

☛ Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

నా ఇంటర్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..
ఈసీఈ స్టూడెంట్‌ కావడంతో సెమీ కండక్టర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. హాబీలు, సాధారణ ప్రశ్నలు అడిగారు. సోషల్‌ మీడియా దుష్ప్రభావాల గురించి, లీడర్‌షిప్‌ క్వాలిటీ ఏవిధంగా ఉండాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి ఇంకా చేయాల్సిన అంశాలపై అడిగారు. 

#Tags