Success Story: ‘పల్లి’టూరి మొనగాడు..సివిల్స్‌లో మెరిసాడు..

అచ్చంగా తెలుగు భాషలోనే చదివాడు. గ్రామీణ ప్రాంతంలోనే ఎదిగాడు. ఉన్నత వైద్యవిద్య అభ్యసించాడు.
Palli Srikanth, IAS

బంగారు పతకం సాధించాడు. కానీ ప్రజాసేవకు దగ్గరి మార్గమైన సివిల్స్‌ను ఎంచుకున్నాడు. రేయింబవళ్లు చదివాడు. విజయబావుటా ఎగరేశాడు. సివిల్స్ ఫలితాల్లో 413వ ర్యాంకు సాధించాడు. పార్వతీపురానికి జాతీయస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. ఆ యువకుడే రామాపురం కాలనీకి చెందిన పల్లి శ్రీకాంత్. ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ఈ విజేత విజయగాథ అతని మాటల్లోనే..
 
కుటుంబ నేప‌థ్యం :
నాన్న సంజీవరావు నాయుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 1992లో చనిపోయారు. అమ్మ విజయప్రభ పార్వతీపురం ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ ఎలిమెంటరీ పాఠశాల (గంటా బడి) ఉపాధ్యాయిని. అమ్మ, మేనమామల సంరక్షణలో చదువుకున్నాను. 

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.

చ‌దువు :
ప్రాథమిక స్థాయి వరకు కొమరాడ మండలం శివినిలోని ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ ఎలిమెంటరీ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు పార్వతీపురంలోని ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ హైస్కూలు (బాయ్స్ ఆర్‌సీఎం)లోను చదువుకున్నాను. విశాఖలోని శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తయ్యాక, ఆంధ్ర వైద్య కళాశాలలో బంగారు పతకంతో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. నా సోదరి ప్రియాంక ఎం.ఫార్మసీ చేసింది.
 
నా ల‌క్ష్యం ఇదే..
వైద్యునిగా ప్రజా సేవ చేయొచ్చు. కానీ సివిల్స్‌లో నెగ్గితే పేదలకు నేరుగా సహాయపడవచ్చు. అందుకే వైద్యవిద్య చదువుతున్నప్పుడే సివిల్స్ వైపు దృష్టి సారించాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించాను. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటికి  పరిష్కారాలు కూడా ఉన్నాయి. కానీ  అమలు సరిగ్గా లేదు. దీనికి నా వంతు కృషి చేస్తాను.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే
 
వీరి వల్లే విజయం..
రెండుసార్లు సివిల్స్‌లో అపజయం పొందినప్పుడు చలం, సురేష్, జయరామ్, రాజు, నాయుడు, పోలినాయుడు, కిరణ్‌కుమార్, మధుకిశోర్, మోహనరావు, ధనుంజయ నాయుడు, మానస, మనీష, గౌరమ్మ కల్పించిన మనోధైర్యమే నా విజయానికి దోహదపడింది. దీంతో సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. శివశంకర్, శిభిచక్రవర్తి, బాబూజీ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌లు నాలో ఆత్మస్థయిర్యం పెరిగేందుకు ఎంతగానో కారకులయ్యారు.
 
అమ్మ గురించి ఏం చెప్పినా తక్కువే..
నాన్న చనిపోయాక నాకు సర్వస్వం అమ్మే అయ్యింది. ఏ నాడూ ‘ఇది చెయ్యి.. అది చెయ్యి’ అనే మాటలు ఆమె నోటివెంట రాలేదు. మామయ్యలు నగిరెడ్డి మధుకిశోర్, మోహనరావు, అమ్మమ్మ గౌరమ్మల సాయం కూడా మరువలేనిది.

Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్‌
 
తనను తాను నిరూపించుకోవాలంటే...
ఇప్పుడు యువత ఏ లక్ష్యాన్ని సాధించేందుకుకైనా ఎన్నో అవకాశాలున్నాయి. తనను తాను నిరూపించుకోవాలంటే సెల్ఫ్ కంట్రోల్ అవసరం. కబుర్లు చెప్పే స్నేహితులే కాదు.. మన విజయానికి తాపత్రయపడే వారిని ఎంచుకోవడం మంచిది.   
                                       
ఢిల్లీకి రాజైనా జన్మభూమికి బిడ్డే..
ఐఏఎస్.. ఈ మూడక్షరాల పదవి భారత సివిల్ సర్వీసుల్లో అత్యున్నతమైనది. పాలనలో కీలకమైన ఈ ఉద్యోగం అఖిల భారతీయ స్థాయిలో ఎందరికో తీరని కల. అది సాధించేందుకు ఆ యువకుడు పరితపించాడు.. పరిశ్రమించాడు. పట్టుదలతో కైవసం చేసుకున్నాడు. పదిమందికీ స్ఫూర్తినిస్తున్నాడు.  అందుకే రెండ్రోజుల్లో ఉద్యోగంలో చేరేముందు జన్మనిచ్చిన పార్వతీపురం గుర్తొచ్చింది. అంతే..జన్మభూమిపై వాలిపోయాడు. విద్యాబుద్దులు నేర్పిన పాఠశాలను సందర్శించాడు. పిల్లలతో ఆటపాటలతో ఆనందంగా గడిపాడు. లక్ష్య సాధనకు మెలకువలను వివరించాడు. అందరి అభినందనలు మూటగట్టుకుని విధుల్లో చేరేందుకు బయల్దేరాడు. అతనే యువ ఐఏఎస్ అధికారి పల్లి శ్రీకాంత్.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

అసిస్టెంట్ కలెక్టర్‌గా.. 
ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకుని.. పశ్చిమబంగ రాష్ట్రం ముర్షిదాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాలి. దానికి ముందు రెండు రోజులు సెలవు దొరకడంతో పార్వతీపురం వచ్చారు. ఓనమాలు నేర్పిన ఆర్‌సీఎం (బాలురు) పాఠశాలను సందర్శించారు.

లక్ష్యం సమున్నతమైతే ఏదైనా సాధ్యమే..
పాఠశాల హెడ్మాస్టర్ జేమ్స్ మాస్టారు, ఇతర ఉపాధ్యాయులతో భేటీ అయిన శ్రీకాంత్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. హైస్కూల్ చదువులోనే మనసులో గట్టిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శారీరక, మానసిక మార్పులు లక్ష్యానికి విఘాతం కల్పించినా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగితే విజయం వరించడం తధ్యమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు చక్కగా, ఓపికగా సమాధానాలు చెప్పి వారిని ఆకట్టుకున్నారు.

గుర్తుకొస్తున్నాయి..
పాఠశాలలోని తరగతి గదిలో గతంలో తాను కూర్చున్న బెంచీలో పిల్లల మధ్య గడిపి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తనకు బంగారు భవితను ప్రసాదించిన పార్వతీపురంలోని ప్రతి ఒక్కరికీ.. చదువుకున్న పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్వతీపురం పట్టణానికి మంచి పేరు తీసుకొస్తానన్నారు.

​​​​​​​Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

Civils Results : సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు...ఐఏఎస్ అయ్యాడిలా..

#Tags