IPS Officer Success Story : ఇందుకే 16 ఉద్యోగాలకు భాయ్ భాయ్ చెప్పా..కానీ..
ఈ యువతి పేరు..తృప్తీ భట్. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి తృప్తీ భట్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
తృప్తీ భట్.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన వారు. ఈమె ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. తన నలుగురు తోబుట్టువులలో ఆమె పెద్దది.
అబ్దుల్ కలాం స్వయంగా తన చేతులతో..
ఆమె 9వ తరగతి చదువుతుండగా దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను కలిసే అవకాశం వచ్చింది. కలాం స్వయంగా తన చేతులతో రాసిన లేఖను తృప్తికి ఇచ్చారు. అందులో ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు ఉన్నాయి. కలాం నుంచి స్ఫూర్తి అందుకున్న తృప్తి చదువులో అమోఘంగా రాణించింది.
ఆరు ప్రభుత్వ పరీక్షలలో..
ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన తృప్తీ భట్ బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివిన ఈ యువతి ఇస్రోతో పాటు ఆరు ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకున్నారు.
అద్భుతమైన అవకాశాలను వదులుకుని..
బాల్యంలోనే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్న తృప్తి తనకు వచ్చిన అద్భుతమైన అవకాశాలను వదులుకుని ఒక్కో మెట్టు పైకి ఎదిగారు. తైక్వాండో, కరాటేలో శిక్షణ తీసుకోవడంతో పాటు మారథాన్, బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటి బంగారు పతకాలను సాధించారు. తృప్తీ భట్ 16 ఉన్నత ఉద్యోగాలను రిజెక్ట్ చేశారంటే ఐపీఎస్ కావాలనే తన లక్ష్యం ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఐపీఎస్ సాధించాలంటే ఉండే కష్టాలు అన్నీఇన్నీ కావు. మన దేశంలోని విజయవంతమైన ఐపీఎస్ అధికారులలో తృప్తీ భట్ ఒకరు.
తృప్తీ భట్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తృప్తీ భట్ తొలి ప్రయతంలోనే 165వ ర్యాంక్ తో ఐపీఎస్ కావాలనే లక్ష్యాన్ని సాధించారు. టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆమె నిరూపించారు. ఈమె సాధించిన విజయాలు నేటి పోటీ ప్రపంచంలో ఉన్న యువతరానికి స్ఫూర్తిధాయకంగా ఉంటుంది.