Aashna Chaudhary IPS Officer Real Life Story : తిరస్కరించారు... పోరాటం చేసి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యారిలా.. కానీ ఈమె మాత్రం..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. చాలా క‌ష్టం. అది ఒక రంగంలో ఉంటూ.. యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిప‌రేష‌న్ చేయడం కత్తి మీద సాము లాంటిది.

ఉత్తరప్రదేశ్‌లోని హపుడ్ జిల్లా పిల్ఖువాకి చెందిన ఆష్నా చౌధురి మాత్రం ఇప్పుడు చాలా మందికి రోల్ మోడల్‌గా మారారు. యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల‌ల్లో విజ‌యం సాధించి.. ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యారు. ఇప్పుడు రౌడీలను పరిగెత్తించే డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో యువ ఐపీఎస్ అధికారి  ఆష్నా చౌధురి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

ఆష్నా చౌధురి ఉత్తరప్రదేశ్‌లోని హపుడ్ జిల్లా పిల్ఖువాకి చెందిన వారు. ఈమె చదువుకున్న ధనిక కుటుంబానికి చెందిన వారు. ఆమె కుటుంబంలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారు. అందుకే ఆష్నా కూడా పీహెచ్‌డీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆష్నా ఆలోచన వీటన్నింటికీ భిన్నంగా ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యారు.

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

ఆష్నా చౌధురి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందున వారు తరచుగా ఇంట్లో అధికారుల గురించి మాట్లాడుకునే వాళ్లు. దాంతో ఆమె ఆలోచన ఎప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పట్ల ఆకర్షితురాలు అయిందో ఆషానాకే తెలియదు. అయితే ఈమె కూడా ఓ మంచి ఆఫీసర్‌ కావాలని నిర్ణయించుకుంది.

ఎడ్యుకేష‌న్ :

ఆష్నా చౌధురి ఘజియాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఆనర్స్ చేసింది. ఆ తర్వాత సౌత్ ఏషియన్ యూనివర్శిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేసింది.

☛ UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

చదువుతూనే..

చ‌దువుకునే.. టైంలోనే ఈమె అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. జోష్ టోక్స్ కూడా ఈమెను తిరస్కరించారు. కానీ అంతటితో ఆగకుండా అలసిపోకుండా, అధైర్యపడకుండా కష్టపడి పని చేస్తూనే ఉంది. ఆష్నా తన మాస్టర్స్ తర్వాత ఒక సంవత్సరం విరామం తీసుకొని.. యూపీఎస్సీ సివిల్స్  (UPSC) పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. 

యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిప‌రేష‌న్ ఇలా..

ఆమె యూపీఎస్సీ సివిల్స్‌కు 8 నుంచి 9 గంటల పాటు.. నిరంతరం చదువుకునేది. ఆమె గత సంవత్సరం ప్రశ్నపత్రాలను చదివి టైమర్‌ని సెట్ చేయడం ద్వారా వాటిని పరిష్కరించేది. అయితే ఆమె మొదటి రెండు ప్రయత్నాలలో విఫ‌లం చెందింది. కానీ ఆమె ప‌ట్టిన‌ పట్టు వదలకుండా కష్టపడి ప్రిప‌రేష‌న్‌ను కొన‌సాగిస్తూనే ఉంది. ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్స్‌ మూడో ప్రయత్నంలో 116వ ర్యాంక్ సాధించింది.. త‌న క‌ల‌ను నెరవేర్చుకుని.. ఐపీఎస్ ఆఫీస‌ర్ అయింది.

➤☛ UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

నేను చెప్పేది ఒక్క‌టే..

మీకు ధైర్యం ఉన్నంత వరకు మీరు మీ ప్రయత్నాలను ఎట్టిప‌రిస్థితుల్లో విరమించకోకూడదు. ఎందుకంటే... ప్రయత్నించే వారు ఎప్పుడూ విఫలం కారని ఈ యువ ఐపీఎస్ అధికారిణి నేటి యువ‌త‌కు సందేశం ఇచ్చింది. జీవితంలోని నమ్మిన సూత్రం ఏమిటంటే.. మీరు మీకు కావలసినదాని కోసం రాత్రి, పగలు త్యాగం చేయాలని.. లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయాల‌న్నారు. ఇలా చేస్తే తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటార‌న్నారు.

ఈమెకు 2 లక్షల 64 వేల మందికి పైగా.. 

ఆష్నా చౌదరి ఇప్పుడు చాలా మందికి రోల్ మోడల్‌గా మారారు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఇన్‌స్టాలో ఈమెకు 2 లక్షల 64 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా అందం, అధికారం రెండు కలిగిన మహిళ ఐపీఎస్ అధికారిణి ఎవరూ అంటే ఇప్పుడు అష్నా చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈమె మనసు చిరుతపులి లాంటిది. ఇక తన అందంతో మోడల్స్‌ను కూడా వెనక్కి నెట్టేస్తోంది. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సెలబ్రిటీల్లా మారిపోతున్నారు. అయితే వాళ్లు గతంలో మోడలింగ్ వంటివి చేయకపోయినా.. వాళ్లకున్న తెలివి తేటలతో చదువుల్లో రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అంతకు మించి అప్ డేట్ అవుతూ.. తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు.

 UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..

ఆష్నా చౌధురి.. ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయ‌లేదు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాటం చేశారు. ఈమె విజయాలు ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయి.

#Tags