IPS Officer Success Story : ఆరేళ్ల బాబును వదిలి ఐపీఎస్‌కు ట్రైనింగ్‌కు వచ్చా.. కానీ..మా అబ్బాయి అలా అడిగినప్పుడు ఆశ్చర్యమేసింది..

నీ లక్ష్యం కోసం వెళ్లు.. నేను కుటుంబాన్ని చూసుకుంటా అని.. భ‌ర్త భ‌రోసా ఇచ్చాడు. అనుకున్న వెంట‌నే.. లక్షల్లో జీతం వ‌చ్చే ఉద్యోగానికి రాజీనామా చేశారు. యూనియ‌న్ ప‌బ్ల‌క్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్‌కు ప్రిపేర‌య్యారు ఈమె.
Nithya Radhakrishnan IPS

అనుకున్న రంగంలో స‌క్సెస్ సాధించి.. ఐపీఎస్ అనే స‌క్సెస్.. త‌న భ‌ర్త‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యం కోసం ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వ‌చ్చారు. ఈమె ఐపీఎస్ ట్రైనింగ్‌లో కూడా బెస్ట్ టైనీ ఐపీఎస్‌గా అనిపించుకున్నారు. చివరకు మా బ్యాచ్‌లో లేడీప్రోబేషనరీ ఔట్‌డోర్‌ టాపర్‌గా నేను నిలవడం సంతోషంగా ఉందంటున్నారు.. నిత్యా రాధాకృష్ణన్ ఐపీఎస్‌.  ఈ నేప‌థ్యంలో నిత్యా రాధాకృష్ణన్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

☛ IPS Success Story : రూ.20 లక్షల ప్యాకేజీకి టాటా చెప్పింది.. ఐపీఎస్‌కు వెల్‌క‌మ్ చెప్పిందిలా..

కుటుంబ నేప‌థ్యం : 
నాది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా. మా నాన్నగారు రైతు, మా అమ్మ టీచర్‌. నాకు ఒక చెల్లి. 

ఎడ్యుకేష‌న్ :
వీఐటీ యూనివర్సిటీ వెల్లూరులో నేను బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. తర్వాత వివాహం అయ్యింది. 

ల‌క్ష‌ల్లో జీతం.. కానీ..
 సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం.. ల‌క్ష‌ల్లో జీతం.. అయినా ఏదో వెలితి ఉండేది. దాన్ని వదిలేశాను. ఆడిట్‌ అండ్‌ అకౌంట్‌ సర్వీస్‌లో పనిచేశాను. అదీ మంచి ఉద్యోగమే అయినా తృప్తి లేదు. ప్రజలతో మమేకమై వారికి ఉపయోగపడే వృత్తిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే నాకు కొడుకు పుట్టాడు.

☛ Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

నీ లక్ష్యం కోసం వెళ్లు.. కానీ..
ఈ టైంలో మంచి ఉద్యోగం వదిలి సివిల్స్‌ ఎందుకు అని మా కుటుంబం, ముఖ్యంగా నా భర్త నిరుత్సాహపర్చలేదు.. నీ లక్ష్యం కోసం వెళ్లు.. కుటుంబాన్ని నేను చూసుకుంటా అన్నాడు. దాంతో బాబు పుట్టిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ ప్రారంభించాను. అలా ఐపీఎస్‌కి సెలెక్ట్‌ అయ్యాను.  

ఐపీఎస్‌ శిక్షణ అనేది అంత చిన్న విషయమేమీ కాదు.. కానీ..

నేను ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌లో ట్రోఫీ పొందానంటే ఈ ట్రైనింగ్‌ నాలో పెంచిన ఆత్మవిశ్వాసమే కారణం. ఐపీఎస్‌ శిక్షణ అనేది అంత చిన్న విషయమేమీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా ఎంతో శ్రమించాలి. శిక్షణ ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించినా.. క్రమంగా మనలోని శక్తిని మనం గుర్తింస్తాం. నిత్యా రాధాకృష్ణన్,ప్రోబేషనరీ ఐపీఎస్ ను ఏజీఎంటీయూటీ కేడర్‌కు కేటాయించారు. 

☛ UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

అమ్మయ్యాక ఐపీఎస్‌ కావాలన్నా..
పెళ్లై, బాబు ఉన్నాడు. ఆ తర్వాతే ఐపీఎస్‌ అవ్వాలనిపించింది. అమ్మయ్యాక ఐపీఎస్‌ కావాలన్న ఆలోచన రావడానికి కారణం మా అమ్మ అనుపమాదేవి. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పట్టుదలగా చదివి ఉపాధ్యాయిని అయ్యింది. ఆమె ఇచ్చిన స్ఫూర్తి.. మావారి ప్రోత్సాహంతో సివిల్స్‌ రాసి విజయం సాధించా. 

ఇష్టపడి వచ్చినందుకేమో.. కష్టమనిపించలేదు..
క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. అందుకే యోగా, ఫైరింగ్‌, గుర్రపుస్వారీ, ఈత అన్నింటినీ ఆస్వాదించా. ఇష్టపడి వచ్చినందుకేమో కష్టమనిపించలేదు. శిక్షణలో భాగంగా అర్ధరాత్రి 9 కేజీల బరువుతో ఎనిమిది గంటలపాటు 40 కి.మీ. రూట్‌ మార్చ్‌, రెండు గంటల్లో  21 కి.మీ. మారథాన్‌ వంటివి ఎప్పటికీ మరిచిపోను. 

మా అబ్బాయి అలా అడిగినప్పుడు ఆశ్చర్యమేసింది..
‘అమ్మా.. నాన్న కదా పోలీసు అవ్వాలి. నువ్వు అయ్యావేంటి? అని మా అబ్బాయి అడిగినప్పుడు ఆశ్చర్యమేసింది. లింగభేదం లేదనే విషయాన్ని ముందుగా వాడికి నేర్పడం మొదలుపెట్టా. నేటి తరం అమ్మాయిలకూ ఇదే చెబుతున్నా... మనసుకిష్టమైంది చేయండి. పట్టుదల ముందు ఏదైనా తల వంచి తీరాల్సిందే.

☛ Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

నేను మొదటి పోలీస్‌ను..


మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్‌ను. ఎంతోమంది మహిళా పోలీసు అధికారులు నేను చూసిన వాళ్లు.. వాళ్లంతా నాకు ప్రేరణే. ఒక మహిళా పోలీస్‌ అధికారిగా నా వృత్తి జీవితంలో మహిళలు, చిన్నారుల సంరక్షణకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ట్రాన్స్‌ జెండర్స్‌, వేశ్యా వృత్తుల్లో ఉన్నవారికి చట్టపూర్వకంగా చేయూతనందించాలని ఉంది. నా శిక్షణలో నా కుటుంబం పోర్ట్‌ ఎంతో ఉంది.

☛ Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

#Tags