Free Civils Coaching: OUలో సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని సివిల్‌ సర్వీస్‌ అకాడమీలో ఉచిత శిక్షణ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్‌ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్‌ పీజీ కళాశాలలు, నిజాం కాలేజీలకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ విద్యార్థులు, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఇతర పీజీ కోర్సుల విద్యార్థులు డిసెంబర్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ డాక్టర్‌ కొంగ నాగేశ్వర్‌రావు తెలిపారు.

చదవండి: సివిల్స్ -  స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

సివిల్‌ సర్వీస్‌ అకాడమీలోని 100 సీట్లను డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. సీటు సాధించిన అభ్యర్థులకు మే 1 వరకు (నాలుగున్నర నెలలు) శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.  

#Tags