Free Training: నిరుద్యోగ యువతక ఉచిత శిక్షణ.. చివరి తేదీ ఇదే
Sakshi Education
సింథియా: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్ షిప్ బిల్డింగ్(సెమ్స్)లో టయోట్స్ రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో సీఎన్‌సీ ఆపరేటర్, ఇన్వెంటరీ కంట్రోలర్, వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉపాధి ఆధారిత కోర్సుల్లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సీఈవో సేతు మాధవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Free Training
ఈ శిక్షణకు 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగిన ఇంటర్, ఐటీఐ, డిప్లమో కోర్సుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలిగిన విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు సింథియా జంక్షన్ సమీపంలోని సెమ్స్ కేంద్రంలో గానీ, 86884 11100, 83319 01237, 0891–2704010 ఫోన్ నంబర్లలో గానీ ఈ నెల 17వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు.