Gurukul Admissions 2025 : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
Sakshi Education
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతికి ఇంగ్లిషు మాధ్యమం, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిషు మాధ్యమంలో ప్రవేశానికి బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Gurukul Admissions 2025
ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ ఉంటుందన్నారు. 5వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.