Non Gazetted Jobs: నాన్ – గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ పరీక్ష

నాన్ – గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి 2022 నుంచి ఆన్ లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు(సెట్‌) నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మే 23న చెప్పారు.
నాన్ – గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ పరీక్ష

డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్, పర్సనల్‌(డీఓపీటీ)లోని ఆరు స్వతంత్ర సంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆన్ లైన్ సెట్‌ను నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్ ఆర్‌ఏ) నిర్వహిస్తుందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఇదొక కీలక మలుపు అని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ఎగ్జామ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

#Tags