NDA Exam: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరాలని కలలు కనే యువతకు...

UPSC National Defence Academy (NDA) 2 Exam 2021

ప్రపంచ వ్యాప్తంగా సైనిక విద్యా శిక్షణలో మంచి గుర్తింపు పొందిన సంస్థ.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ). ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరాలని కలలు కనే యువతకు శిక్షణ ఇచ్చి, తీర్చిదిద్దుతోంది. యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆయా విభాగాల్లో శిక్షణను అందించి సాయుధ దళాల్లోకి తీసుకుంటారు. ప్రస్తుత ఏడాదికి ఎన్‌డీఏ(2) పరీక్ష..నవంబర్‌(ఈనెల) 14వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఎగ్జామ్‌ డే టిప్స్‌..


400 ఖాళీలకు పరీక్ష
ఇండియన్‌ ఆర్మీ–208, నేవీ–42, ఎయిర్‌ఫోర్స్‌–128(28 గ్రౌండ్‌ డ్యూటీ), ఇండియన్‌ నా వల్‌ అకాడమీ(10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)–30 చొప్పున మొత్తం 400 ఖాళీల భర్తీకి ఆఫ్‌లైన్‌(పెన్‌ అండ్‌ పేపర్‌) విధానంలో ఎన్‌డీఏ2 పరీక్షను నిర్వహించనున్నారు.

రెండు పేపర్లు: 900 మార్కులు
రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌ 300 మార్కులకు, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

మ్యాథమెటిక్స్‌
300 మార్కులకు జరిగే మ్యాథమెటిక్స్‌ విభాగంలో 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2.5 మార్కులను కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 0.33 శాతం మార్కులను తగ్గిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 

చ‌ద‌వండి: డిగ్రీతో డిఫెన్స్‌ కొలువు.. శిక్షణ‌లోనే రూ.56 వేల‌కు పైగా స్టయిఫండ్‌..

జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌

  • జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ విభాగానికి సంబంధించి 600 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి. ఇది రెండు పార్ట్‌లుగా నిర్వహిస్తారు.
  • పార్ట్‌–ఎ: ఈ విభాగం నుంచి ఇంగ్లిష్‌పై 200 మార్కులకు ప్రశ్నలుంటాయి. 
  • పార్ట్‌–బి: ఈ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, హిస్టరీ, ఫ్రీడమ్‌ మూమెంట్‌ కరెంట్‌ ఈవెంట్స్‌ తదితర అంశాల నుంచి 400 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. 
  • పరీక్ష సమయం రెండున్నర గంటలు. 

రివిజన్‌

  • ఎన్‌డీఏ పరీక్షకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రిపరేషన్‌ పూర్తిచేసి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. పూర్తిగా రివిజన్‌పై దృష్టిపెట్టాలి. 
  • ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్క టాపిక్‌ ముఖ్యాంశాలను పునశ్చరణ చేయాలి. 
  • ఇప్పుడు అందుబాటులో ఉన్న సమయంలో ఒకటి లేదా రెండు మాక్‌టెస్ట్‌లు రాయడం మేలు. తద్వారా పరీక్ష రోజున ప్రదర్శనపై ఒక అంచనాకు రావొచ్చు. 
  • గత ప్రశ్నపత్రాలు: యూపీఎస్సీ గతంలో నిర్వహించిన ఎన్‌డీఏ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయడం పరీక్ష పరంగా కలిసొస్తుంది. ఇందులో కూడా ఎక్కువసార్లు అడిగిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. దీనివల్ల ప్రశ్నల సరళిపై స్పష్టత వస్తుంది.
  • ఎన్‌డీఏ 2 పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు కచ్చితంగా సమాధానం తెలిసిన ప్రశ్నలనే అటెంప్ట్‌ చేయాలి.
  • వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

చ‌ద‌వండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

#Tags