Skip to main content

డిగ్రీతో డిఫెన్స్‌ కొలువు.. శిక్షణ‌లోనే రూ.56 వేల‌కు పైగా స్టయిఫండ్‌..

చక్కటి ఉద్యోగం.. ఆకర్షణీయ వేతనం.. సుస్థిరమైన భవిష్యత్తు.. డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరి స్వప్నం!!అందులోనూ..ప్రభుత్వ కొలువు సాధిస్తే.. భవిష్యత్తుకు ఎంతో భద్రత! అందుకోసం.. అనేక పరీక్షలు రాస్తూ.. వాటిలో విజయానికి అహర్నిశలు కృషి చేస్తుంటారు. ఇలాంటి యువతకు చక్కటి అవకాశం.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌!!

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మలిదశ ఎంపిక ప్రక్రియలోనూ సత్తా చూపితే.. త్రివిధ దళాల్లో తిరుగులేని కెరీర్‌ సొంతమవుతుంది! దేశ సేవలో భాగస్వాములమవుతున్నామనే సంతృప్తి కూడా దక్కుతుంది!! తాజాగా.. యూపీఎస్‌సీ.. సీడీఎస్‌ఈ (2) – 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ పరీక్షకు అర్హతలు.. ఎంపిక ప్రక్రియ.. విజయానికి సన్నద్ధత.. త్రివిధ దళాల్లో కెరీర్‌ స్కోప్‌పై సమగ్ర కథనం..

దేశ భద్రతలో పాల్పంచుకోవాలనే తపన, తెగువ,సాహసం కలిగిన యువతకు త్రివిధ దళాలు చక్కటి మార్గం. యూపీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ద్వారా రక్షణ దళాల్లో ఉన్నత స్థాయి కొలువు, ఆకర్షణీయ వేతనంతోపాటు, ఉద్యోగ భద్రత లభిస్తుంది. అంతేకాకుండా పర్మనెంట్‌ కమిషన్‌తో ఆఫీసర్‌ హోదాలో కెరీర్‌ ప్రారంభించొచ్చు. త్రివిధ దళాల్లోని ఆఫీసర్‌ కేడర్‌ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్ష ప్రతి ఏటా రెండుసార్లు జరుగుతుంది.

మొత్తం ఖాళీల సంఖ్య : 339
సీడీఎస్‌ఈ(2)–2021 ద్వారా త్రివిధ దళాలకు చెందిన మొత్తం అయిదు అకాడమీలలో 339 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవి..

  • ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్‌): 100
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఎజిమలా): 22
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (హైదరాబాద్‌): 32
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (చెన్నై) (పురుషులు): 169
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (చెన్నై) (మహిళలు): 16

విద్యార్హతలు..
ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై): గుర్తింపు పొందిన యూనివ ర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
మిలిటరీ అకాడమీ: జూలై 2, 1998– జూలై 1, 2003 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ: జూలై 2, 1997–జూలై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

నేవల్‌ అకాడమీ:
అర్హత: బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 2, 1998 – జూలై 1, 2003 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ:
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 2,1998–జూలై1, 2002 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

  • విద్యార్హత చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎలాంటి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉండకూడదు. కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ ఎస్‌బీ ఇంటర్వూ సమయానికి ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ చూపించాలి.
  • మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మాత్రమే అర్హులు.

రెండంచెల ఎంపిక ప్రక్రియ..
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌(సీడీఎస్‌ఈ) ద్వారా త్రివి« ధ దళాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. వీటిలో మొదటిది.. సీడీఎస్‌ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి..మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులను మలి దశకు ఎంపిక చేస్తారు. ఆయా దళాలకు చెందిన సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వూ ప్రక్రియ నిర్వహిస్తాయి.

రాత పరీక్ష విధానం..
సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు తగ్గిస్తారు.

ఐఎంఏ, ఐఎన్‌ఏ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలకు పరీక్ష విధానం..

సబ్జెక్ట్‌ వ్యవధి మార్కులు
ఇంగ్లిష్‌ 2 గంటలు 100
జనరల్‌ నాలెడ్జ్‌ 2 గంటలు 100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 2 గంటలు 100

ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పరీక్ష విధానం..

సబ్జెక్ట్‌ వ్యవధి మార్కులు
ఇంగ్లిష్‌ 2 గంటలు 100
జనరల్‌ నాలెడ్జ్‌ 2 గంటలు 100

రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో ఇంటెలిజె¯Œ్స అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహి స్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసా గుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి మాత్రం 6రోజుల పాటు నిర్వహిస్తారు.

ఇంటర్వూకు 300 మార్కులు..

  • ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్యలో మొదటి రోజు స్టేజ్‌–1 స్క్రీనింగ్‌ టెస్టు ఉంటుంది. ఈ దశలో అర్హత సాధిస్తే స్టేజ్‌–2కు అనుమతిస్తారు. స్టేజ్‌–1లో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌) టెస్ట్‌లు, స్టేజ్‌–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్కులు, ఇంటర్వూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. వీటిని నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌(డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌(ఎస్‌ఆర్‌టీ), సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌(ఎస్‌డీ) ఉంటాయి. వీటన్నింటి తర్వాత బోర్డ్‌ ప్రెసిడెంట్‌ లేదా సీనియర్‌ సభ్యుడు ఇంటర్వూ్య చేస్తారు. అనంతరం చివరగా కాన్ఫరె¯Œ్స ఉంటుంది.ప్యానెల్‌ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ ఉంటుంది. తుది దశకు చేరుకున్న విద్యార్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

రూ.56,100 స్టయిపండ్‌..
అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టయిపండ్‌ కూడా చెల్లిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ప్రవేశించవచ్చు. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌–లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు తొలుత ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధులు చేపడతారు.

Published date : 10 Aug 2021 02:53PM

Photo Stories