SBI 10000 New Jobs Notification 2024 : మరో భారీ నోటిఫికేషన్.. ఎస్‌బీఐలో 10000 ఉద్యోగాలకు...

టెక్నాలజీ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. కాబట్టి, మొత్తంగా ప్రస్తుత సంవత్సరంలో 8,000 నుంచి 10,000 మంది అవసరం మాకుంది. ప్రత్యేక విభాగంతో పాటు సాధారణ విభాగంలోనూ ఉద్యోగుల చేరిక ఉంటుంది అని పేర్కొన్నారు.
☛➤ Canara Bank Apprentice Recruitment 2024: కెనరా బ్యాంక్‌లో 3000 పోస్టులు.. అర్హతలు ఇవే
ఎస్‌బీఐలో ఇప్పటి వరకు..
ఎస్‌బీఐలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296. ఇందులో 1,10,116 మంది ఆఫీసర్లు. ఇక బ్యాంక్ నెట్‌వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. ఇవి కాకుండా 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కరస్పాండెంట్ కేంద్రాలు ఉన్నాయి.
సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై ఎస్‌బీఐ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
1,500 మందిని..
మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే జనరల్ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ఇటీవల ఎంట్రీ లెవల్‌తో పాటు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ అర్హుల నియామకాలను ప్రకటించాం అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు.