Skip to main content

Bank Jobs 2025 Notification : 650 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే.. రూ 6.50 ల‌క్ష‌ల‌ జీతం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో వివిధ బ్యాంకులు ప‌లు ఉద్యోగాల‌కు వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు ఇస్తున్న విష‌యం తెల్సిందే.
IDBI Bank Jobs 2025 Notification   IDBI Bank Junior Assistant Manager Recruitment 2025   IDBI Bank 650 Junior Assistant Manager Vacancies Notification

ఇప్పుడు తాజాగా ఐడీబీఐ బ్యాంక్ నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వ‌చ్చింది. ఈ ప్రకటన ద్వారా 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీలను (యూఆర్‌- 260, ఎస్సీ- 100, ఎస్టీ- 54, ఈడబ్ల్యూఎస్‌- 65, ఓబీసీ- 171, పీడబ్ల్యూడీ- 26) భర్తీ చేయ‌నున్న‌ది.

ద‌ర‌ఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాల‌కు 2025 మార్చి 1వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వ‌యో ప‌రిమితి... :
ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 

☛➤ SSC CGL Total Vacancies 2025 : గుడ్‌న్యూస్‌.. 18,174 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..? ఈ సారి ఎక్కువ‌గా...

ఎంపిక విధానం ఇలా..
ఆన్‌లైన్ ప‌రీక్ష‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో 0.25% నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తేదీ ఏప్రిల్‌ 6, 2025.

పరీక్షా కేంద్రాలు : 
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

ఈ ఉద్యోగంకు ఎంపికైతే...
ఈ ఉద్యోగంకు ఎంపికైన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్... ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సుకు సంబంధిత క్యాంపస్‌లో 6 నెలల క్లాస్ రూమ్ స్టడీస్, 2 నెలల ఇంటర్న్ షిప్, 4 నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) పొందుతారు. ఉద్యోగంలో చేరిన తరువాత ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం అందజేస్తారు.

స్టైపెండ్ :

శిక్షణ సమయంలో నెలకు రూ.5,000, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ 6.50ల‌క్ష‌ల‌ వరకు జీతం ఉంటుంది.

➤☛ Free Education Schools : ఈ స్కూల్స్‌లో సీటు వ‌స్తే... ఇంట‌ర్‌ వరకు అంతా ఫ్రీ...

Published date : 28 Feb 2025 09:02AM

Photo Stories