Bank Jobs 2022: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా..? అయితే మీకు సరైన మార్గం ఇదే..

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌..! ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టే ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌).. 11 బ్యాంకుల్లో 6,035 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Bank Jobs Recruitment 2022

ఐబీపీఎస్‌ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లరికల్‌ కేడర్‌లో కొలువు  సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిభ, పనితీరుతో.. చీఫ్‌ మేనేజర్‌ స్థాయికి కూడా ఎదిగే అవకాశం ఉంది! ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతోపాటు విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. మొదలైన సమగ్ర సమాచారం మీకోసం..

బ్యాంకు పరీక్షల్లో విజయానికి ఎలా చదవాలి?

పోస్టుల వివరాలు ఇలా..


ఐబీపీఎస్‌.. సీఆర్‌పీ క్లర్క్స్‌–12 ప్రక్రియ ద్వారా.. మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6,035 క్లర్క్‌ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకు, ఐఓబీ, యూకో బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 99 పోస్ట్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో 209 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Banking, Financial Services and Insurance Sectors: బీఎఫ్‌ఎస్‌ఐ.. నియామకాల జోరు!

అర్హతలు ఇవే..
ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

వయసు: 
జూలై 1, 2022 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ,ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక ప్రక్రియ ఇలా..


➤ ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్‌ పరీక్ష ఉంటాయి. తొలుత అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఏ బ్యాంకులో కొలువు ఖరారైందో తెలుపుతూ ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ అందిస్తారు.
➤ ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో.. తెలంగాణ అభ్యర్థులు ఇంగ్లిష్,హిందీ, తెలుగు,ఉర్దూ భాషల్లో పరీక్షకు హాజరు కావచ్చు.

బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ విభాగాలకు ఎలా సిద్ధమవాలి?

ప్రిలిమినరీ పరీక్ష విధానం :
ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం వంద ప్రశ్నలు–వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

మెయిన్స్‌ పరీక్ష విధానం ఇలా..
మెయిన్‌ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. 190 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులు, క్వాం టిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 160 నిమిషాలు.

Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు

విజయం సాధించాలంటే ఈ వ్యూహాలు త‌ప్ప‌నిస‌రి..
నోటిఫికేషన్‌లో నిర్దిష్టంగా పరీక్ష తేదీని ప్రకటించనప్పటికీ.. సెప్టెంబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అంటే.. ఇప్పటి నుంచి అభ్యర్థులకు ప్రిలిమ్స్‌కు రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది.

Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

ఉమ్మడి వ్యూహంతో..
ప్రిలిమ్స్, మెయిన్స్‌ విధానంలో నిర్వహించనున్న ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టుల అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.. మూడు విభాగాలు(ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా, మెయిన్స్‌ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్‌ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగించాలి.

Bank Exam Preparation Tips: వేయికి పైగా ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు.. ప్రిపరేషన్‌తోపాటు కెరీర్‌ స్కోప్‌ గురించి తెలుసుకుందాం..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ :


ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్‌ రీ ఎరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం సైతం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ ది నపత్రికలు చదవడం,వాటిలో వినియోగిస్తున్న పద జాలం,వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ :
దీన్ని మెయిన్స్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. దీనికి సంబంధించి అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)పై పూర్తి పట్టు సాధించేలా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపైనా దృష్టిపెట్టాలి.

కీల‌క‌మైన రీజనింగ్‌ను.. :
ఇది కూడా రెండు పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్‌) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్ కూడా..
ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్స్‌లో అదనంగా ఉండే జనరల్‌ అవేర్‌నెస్, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల ప్రిపరేషన్‌ కూడా సాగించాలి. ఎందుకంటే.. ప్రిలిమ్స్‌ ముగిసిన తర్వాత మెయిన్‌కు చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. 

జనరల్‌ అవేర్‌నెస్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్ ప‌ట్టు ఉంటే..


బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాలు(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్‌ నాలెడ్జ్ నుంచి..
ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్‌ షార్ట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాలు(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్‌ టెస్ట్‌ విధానంపై  స‌రైన అవగాహన ఉంటే..


ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండు కూడా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. కాబట్టి అభ్యర్థులు ఆన్‌లైన్‌ టెస్ట్‌ విధానంపై అవగాహన పెంచుకోవాలి. ఈ విధానంపై ముందస్తు అవగాహన లేకపోతే పరీక్ష రోజు ఇబ్బందికి, ఆందోళనకు గురవుతారు.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: ఆగస్ట్‌ 2022
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ తేదీలు: సెప్టెంబర్‌ 2022
ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2022
ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: అక్టోబర్‌ 2022
ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌: ఏప్రిల్‌ 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  www.ibps.in

పోటీ పరీక్షల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఏయే అంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు?

#Tags