AP TET 2022 Result : ఏపీ టెట్‌-2022 ఫలితాలు విడుద‌ల‌.. అర్హ‌త‌ మార్కులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) టెట్ 2022 ఫలితాలు విడుద‌లయ్యాయి.

ఈ ఫ‌లితాల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్ ప్రకటించారు. 
మీ సాధించిన‌ మార్కుల‌ను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చును.

AP Teacher Recruitment 2022: టీచర్‌ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

How to Check  AP TET 2022 Results ?
☛ Visit direct link available on https://aptet.apcfss.in/CandidateLogin.do
☛ Enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen
☛ Download a copy of the score card for further reference

షెడ్యూల్ ప్రకార‌మైతే సెప్టెంబ‌ర్ 14వ తేదీన‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇదే తేదీన‌ ఫైనల్ 'కీ' ని ప్ర‌క‌టించారు కానీ.. రిజల్ట్స్ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ రిజల్ట్స్ ఆలస్యం అయ్యాయి. ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

అర్హ‌త‌ మార్కులు ఇవే..

టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. 2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్‌ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,07,329 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తం 150 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips||DSC Best Books|| DSC Syllabus|| TET Tips

టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

AP TET 2022 Final Key : ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి కీ లో..

టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి ఈ ప‌రీక్ష రాశారు.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

#Tags