Andhra Pradesh Govt Jobs 2024: ఆంధ్రప్రదేశ్‌లో 234 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య వ్యవస్థలలో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్, డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్, తదితర ఆసుపత్రుల్లో పోస్టులు భర్తీ కానున్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 234
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్‌ మెడిసిన్‌ -38, ఆబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ-37, పీడియాట్రిషియన్‌-114, కార్డియాలజిస్ట్‌/జనరల్‌ మెడిసిన్‌-29, ఎపిడెమియాలజిస్ట్‌-15.
అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషాలిటీలో ఎంపీహెచ్, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,10,000 నుంచి రూ. 1,40,000, ఎపిడెమియాలజిస్ట్‌ పోస్టులకు రూ.60,000.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేష¯Œ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: http://apmsrb.ap.gov.in/

చదవండి: APPSC Polytechnic Lecturer Notification: ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags