Govt Junior College Students: పరీక్షలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ..

ఇటీవలె విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వం అందించిన సదుపాయాలతో, పథకాలతో విద్యార్థులు తమ చదువులో ముందుండి ప్రస్తుతం ఘన విజయం సాధించారు. విద్యార్థుల మార్కులు ఇలా..

అనంతపురం: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో పేదింటి ఆణిముత్యాలు సత్తా చాటారు. పెద్దపెద్ద నగరాల్లో పేరుమోసిన కార్పొరేట్‌ కళాశాలల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన బీసీ పోషిక సీనియర్‌ బైపీసీలో 975 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. కురుగుంట సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల కళాశాల విద్యార్థిని ఎస్‌.బ్రాహ్మణి సీనియర్‌ ఎంపీసీ విభాగంలో 975 మార్కులు, జె.గాయత్రి సీనియర్‌ బైపీసీలో 966 మార్కులు, హెచ్‌.శిరీష సీనియర్‌ సీఈసీలో 959 మార్కులతో మెరిశారు.

Gurukul Students Ranks: ఇంటర్‌లో గురుకుల విద్యార్థులు ప్రతిభ..

అనంతపురం కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థి జి.మణిచంద్‌ సీనియర్‌ ఎంపీసీలో 974 మార్కులతో టాప్‌ లేపాడు. రొద్దం గురుకుల కళాశాల విద్యార్థిని హెచ్‌.శిరీష సీనియర్‌ సీఈసీ విభాగంలో 959 మార్కులు, అమరాపురం గురుకుల కళాశాల విద్యార్థిని ఎం.మౌనిక సీనియర్‌ సీఈసీ విభాగంలో 958 మార్కులతో ప్రతిభ చాటారు. అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని రూపాబాయి సీనియర్‌ బైపీసీలో 963 మార్కులు, ఎంపీసీ విభాగంలో కె.కావ్య 950 మార్కులతో దుమ్ము లేపారు. ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఎస్‌.అంగేశ్వర్‌ కుమార్‌ సీనియర్‌ బైపీసీలో 952 మార్కులు, ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి సిద్దేష్‌కుమార్‌ సీనియర్‌ సీఈసీలో 952 మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు.

English Medium in AP Schools: ఇంగ్లిష్‌ మీడియం జగన్‌ విజన్‌

మొదటి సంవత్సర ఫలితాల్లోనూ..

కురుగుంట సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల కళాశాల విద్యార్థిని డి.రమణి జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు 462 మార్కులు సాధించి సత్తా చాటింది. ఇదే కళాశాలలో జూనియర్‌ బైపీసీ విద్యార్థిని ఎస్‌.గ్రీష్మ 440 మార్కులకు 434 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. బి. పప్పూరు గురుకుల పాఠశాల విద్యార్థి కె.బాలకిషోర్‌ ఎంపీసీలో 455 మార్కులు సాధించాడు. రాయదుర్గం గురుకుల కళాశాల విద్యార్థిని పి.స్పూర్తి సీఈసీలో 474 మార్కులు సాధించింది. రామగిరి గురుకుల కళాశాల విద్యార్థిని ఎం.సుచిత్ర సీఈసీ విభాగంలో 471 మార్కులతో శభాష్‌ అనిపించుకున్నారు.

AP Intermediate Results 2024 :ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా

ప్రభుత్వ చేయూత సద్వినియోగం..

ప్రభుత్వ కళాశాలలను గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోలేదు. వసతులు సమకూర్చడంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవి. అయితే, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక పేద బిడ్డల చదువులకు పెద్దపీట వేసింది. విద్యార్థుల కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన అన్ని వసతులూ సమకూర్చింది. నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు ‘అమ్మ ఒడి’ పథకంతో చేయూత అందించింది. రెసిడెన్షియల్‌ కళాశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, స్టేషనరీ, కార్పెట్స్‌, టవల్స్‌, బెడ్‌షీట్స్‌ అందేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకున్న విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తున్నారు. తాము పేదలమే అయి ఉండొచ్చుకాని చదువులో కాదని ఇంటర్‌ ఫలితాల్లో నిరూపించారు.

PUC Ranker: పీయూసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన యువతి..

#Tags