AP Inter Supplementary Exams 2024: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ తేదీకే.. ఫీజు చెల్లింపుకు గడువు..!

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు ఫలితాలు విడుదలయ్యాయి. అందులో కొందరు ఫెయిల్‌ అయినవారు ఉన్నారు, మరికొందరు తక్కువ మార్కులు రావడంతో మరోసారి పరీక్ష రాయలనుకునేవారున్నారు. అయితే, వారందరి కోసం మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశంగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ..

 

నంద్యాల: మే 25 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వస్తామని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సునీత సోమవారం తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీలో ఫీజు చెల్లించాలని తెలిపారు. జవాబు పత్రాల ఒక్కొక్క పేపర్‌ రీ వెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు.

School Education Department: 23న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు.. పుస్తకాలను వెనక్కి తీసుకోకూడదు..

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూమెంట్‌ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలన్నారు. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూట్‌మెంట్‌ రాయాలనుకునే సైన్స్‌ విద్యార్థులు రూ.1,440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1,240 చొప్పున చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో విద్యార్థులు సంప్రదించాలని డీవీఈఓ తెలిపారు.

Gurukul School Admissions for 5th Students: ఈ రెండు రోజుల్లో గురుకుల ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక..

#Tags