Skip to main content

School Education Department: 23న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు.. పుస్తకాలను వెనక్కి తీసుకోకూడదు..

సాక్షి, అమరావతి: ప్రస్తు­త విద్యా సంవత్సరం ముగిసే నాటికి (ఏప్రిల్‌ 23) వార్షిక పరీక్షల ప్రో­గ్రెస్‌ రిపోర్ట్‌ కార్డును విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఏప్రిల్ 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Progress cards for students on 23rd

గతేడాది విద్యా సంవత్సరం చివరి రోజున తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పేరెంట్స్‌ కమిటీ) సమావేశాలు విజయవంతంగా జరిగాయని, ఈ ఏడాదీ అలాగే జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

చివరిరోజు సమావేశం ఉందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్న విషయాన్ని ఒకరోజు ముందే వారికి గుర్తు చేయాల్సిన బాధ్యత క్లాస్‌ టీచర్లదే అని ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు.

వేసవి సెలవుల్లో విద్యార్థులు సైన్స్, సోషల్‌ పుస్తకాలు చదివేలా ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలని, ఆ బాధ్యత వాళ్లదేనన్నారు. దీనివల్ల వారికి సబ్జెక్టుపై అవగాహనతో పాటు బైలింగ్వుల్‌ పుస్తకాలతో ఇంగ్లిష్‌పై పూర్తి పట్టు సాధిస్తారని వివరించారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

గతేడాది విద్యార్థులను తమ పుస్తకాలను తిరిగి పాఠశాలల్లో అప్పజెప్పడాన్ని  తాను ప్రత్యక్షంగా పరిశీలించానని, ఇది సరైన పద్ధతి కాదని ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలు విద్యార్థుల సొంతమని, మరుసటి ఏడాదికి అవి రిఫరెన్స్‌గా ఉంటాయని తెలిపారు.

కచ్చితంగా విద్యార్థులు ఆయా పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదివేలా ప్రోత్సహించాలన్నారు. పాఠశాలల్లో లైబ్రరీ ఏర్పాటు పేరుతో పుస్తకాలను వెనక్కి తీసుకోకూడదన్న సందేశాన్ని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు చేరవేయాలని డీఈవోలను ఆదేశించారు. 

Published date : 16 Apr 2024 01:28PM

Photo Stories