Gurukul School Admissions for 5th Students: ఈ రెండు రోజుల్లో గురుకుల ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక..
![Gurukul school admissions for fifth class students for this academic students](/sites/default/files/images/2024/04/16/district-coordinator-padmaja-1713254520.jpg)
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక చేసిన మొదటి లిస్ట్‌లో సీట్లు దక్కనివారికి, ఇంకా మిగిలి ఉన్న సీట్ల భర్తీకి బాలురుకు గురువారం కొప్పెర్ల గురుకుల పాఠశాలలో, బాలికలకు శుక్రవారం చీపురుపల్లిలో ఎంపిక జరుగుతుందని జిల్లా సమన్వయకర్త టి.పద్మజ అన్నారు.
Inter School Sports: ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో విద్యార్థులకు పురస్కారం..
ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎంపిక ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని ఆమె తెలియజేశారు. మెరిట్ లిస్ట్ జాబితాలో ఉన్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని, మొబైల్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసిలేదా మెసేజ్ రూపంలో సమాచారం ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాల కోసం బాలికలు ఫోన్ 83330–33434 నంబర్‌కు, బాలురు ఫోన్ 63038–38657 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలియజేశారు. కార్యకమంలో జోగింపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఈశ్వరరావు పాల్గొన్నారు.