Junior College Students : ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌తకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం.. సంక‌ల్ప్‌-2025..

ఈనెల 2 నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రారంభమైన ‘సంకల్ప్‌’ కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరు దాకా కొనసాగ నుంది.

అనంతపురం: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ‘సంకల్ప్‌–2025’ అనే వినూత్న కార్యక్రమానికి ఇంటర్‌ బోర్డు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Supreme Court jobs: డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు జీతం నెలకు 67000

ఈనెల 2 నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రారంభమైన ‘సంకల్ప్‌’ కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరు దాకా కొనసాగ నుంది. పర్యవేక్షణకు జూనియర్‌ లెక్చరర్లు, ఇతర సిబ్బందిని ‘కేర్‌ టేకర్లు’గా నియమించారు. జిల్లాలోని 25 ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 7,084 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,757 మంది చదువుతున్నారు.

మూడు గ్రూపులుగా విభజన..

ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటిదాకా నిర్వహించిన వివిధ పరీక్షల్లో వచ్చిన మార్కులు, తరగతి గదుల్లో కనబరుస్తున్న ఆసక్తిని బట్టి విద్యార్థులను గ్రేడింగ్‌ చేశారు. ప్రతి కాలేజీలో మూడు కేటగిరీలుగా విభజించారు. బాగా చదువుతున్న వారు, అంతంతమాత్రంగా చదువుతున్నవారు, పూర్తిగా వెనుకబడిన విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా చేశారు. రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

టైమ్‌టేబుల్‌..

ప్రతి కాలేజీలోనూ ప్రిన్సిపాళ్లు టైమ్‌టేబుల్‌ను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం విద్యార్థులు ఆయా సబ్జెక్టులు చదువుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను కేర్‌టేకర్లు అంచనా వేస్తూ ప్రిన్సిపాళ్లకు నివేదిక సమర్పిస్తున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అన్ని కళాశాలల్లోనూ అమలు

ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ‘సంకల్ప్‌–2025’ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాల్లోనూ అమలు చేస్తున్నాం. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లదే పూర్తి బాధ్యత. అధ్యాపకులు, కేర్‌ టేకర్లు బాధ్యతగా పని చేయాలి. పూర్తిగా వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి కనీస మార్కులతోనైనా వారిని గట్టెక్కించేందుకు అందరూ కృషి చేస్తున్నాం.

– ఎం. వెంకటరమణనాయక్‌, ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి

RMS 2024 Question Paper with Key PDF: రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్ 6వ తరగతి ప్రశ్న పత్రం, కీ ఇక్కడ చూడండి

#Tags