Intermediate Students: ఇంటర్ విద్యార్థులకు జయిభవ కార్యక్రమంతో శిక్షణ..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులందరూ ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణతే లక్ష్యంగా ‘జయీభవ’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యాపకులు ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేసి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. గత నెల 10న ప్రారంభమైన కార్యక్రమం ఈనెల 28 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.
R Krishnaiah: 1,600 గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయాల్సిందే
ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ
‘జయీభవ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతర్గత, యూనిట్, త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేశారు. కేర్‌టేకర్ పద్ధతిలో ప్రతి 10 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేశారు. బాగా చదువుతున్న విద్యార్థుల్లో ఒకరిని లీడరుగా నియమించారు. లీడర్లుగా ఉన్న వారు తక్కిన 9 మంది ప్రగతిని తరచూ బేరీజు వేసి ఎప్పటికప్పుడు అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులందరినీ అధ్యాపకులకు కేటాయించి వ్యక్తిగతంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.
Gurukul Schools: పేద విద్యార్థులకు గురుకులాల్లో నైపుణ్య విద్యతోపాలు పదిలమైన భవిష్యత్తు..!
చదువుకున్న వెంటనే పరీక్ష
రోజూ ఉదయం మొదటి, రెండు పీరియడ్లు గ్రూపు సబ్జెక్టులు, 3వ పీరియడ్ లాంగ్వేజ్, మధ్యాహ్నం ఒక గ్రూపు సబ్జెక్టు, మరొక లాంగ్వేజ్ సబ్జెక్టు చదివిస్తున్నారు. ప్రతి పీరియడ్‌లోనూ చివరి 20 నిమిషాలు పరీక్ష రాయిస్తున్నారు. చదువుకున్న అంశంపై ఎప్పటికప్పుడు పరీక్ష రాస్తే విద్యార్థులకు బాగా గుర్తుంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. ఆయా సబ్జెక్టుల నిపుణులతో 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించారు. వీటిపై విద్యార్థులకు తరచూ తర్ఫీదు ఇస్తున్నారు.