R Krishnaiah: 1,600 గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయాల్సిందే
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మొత్తం 1,600 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
కేవలం 563 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని మోసం చేయడమేనన్నారు. ఆయన ఫిబ్రవరి 20న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డాక అనేక శాఖల్లో గ్రూప్–1, 2, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఉద్యోగ విరమణ చేసినవారి స్థానాలను సైతం భర్తీ చేయడం లేదని తెలిపారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలెన్ని?, ఎందరు ఉద్యోగ విరమణ చేశారనే సమాచారం కోసం సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వారు నివేదిక ఇవ్వకపోతే తామైనా ఇచ్చేందుకు సిద్ధమని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
Published date : 21 Feb 2024 05:59PM