Inter Advanced Supplementary: ఈనెల 24 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 24న నిర్వ‌హించే స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు..

కాకినాడ: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలను గత నెల 12వ తేదీన విడుదల చేశారు. వీటిల్లో ఫెయిలైన, అత్యుత్తమ మార్కుల కోసం బెటర్‌మెంట్‌కు సిద్ధమైన విద్యార్థులకు ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకూ రెండు సెషన్లుగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ, 2 ఎయిడెడ్‌, 11 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు కలిపి మొత్తం 29 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

Government Schools and Colleges: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లవైపు మొగ్గు చూపుతున్న‌ విద్యార్థులు..!

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి జిల్లావ్యాప్తంగా 22,379 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్‌ జనరల్‌ 14,600, ఒకేషనల్‌ 906, సెకండియర్‌ జనరల్‌ 6,293, ఒకేషనల్‌ 580 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికి ఇప్పటికే ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 29 మంది చీఫ్‌ సూపరింటెండెట్లు, కస్టోడియన్లను నియమిస్తున్నారు. స్టోరేజ్‌ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు. జిల్లా వృత్తి విద్యా అధికారి (డీవీఈఓ), హైపవర్‌ కమిటీ, సిటింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పరీక్షల నిర్వహణను ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు.

EAPCET Rankers: ఈఏపీ సెట్‌లో విద్యార్థుల ప్ర‌తిభ‌.. ఈ ర్యాంకుల్లో నిలిచిన యువ‌కులు!

తేదీ ఫస్టియర్‌/సెకండియర్‌

మే 24 సెకండ్‌ లాంగ్వేజ్‌

మే 25 ఇంగ్లిషు

మే 27 గణితం, బోటనీ, సివిక్స్‌

మే 28 మ్యాథ్స్‌, జువాలజీ, హిస్టరీ

మే 29 ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌

మే 30 కెమిస్ట్రీ, కామర్స్‌,

సోషియాలజీ, మ్యూజిక్‌

మే 31 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాజిక్‌,

బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌

International Conference at MBU: ఎంబీయూలో సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం

రెండు సెషన్లుగా..

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతారు.

NCC Training: ఎన్‌సీసీ శిక్ష‌ణ‌తో విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌..!

ఈ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యాన త్వరలో సమన్వయ శాఖల సమావేశం జరగనుంది. ఇంటర్‌ బోర్డ్‌ అధికారులతో పాటు, వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్‌, రెవెన్యూ, మునిసిపల్‌, డీఈఓ, డీపీఓ తదితర ఎనిమిది శాఖల అధికారులతో ఈ సమావేశం నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డెస్క్‌లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలతో పాటు, బస్సులు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

Counselling for Gurukul Inter Admissions: గురుకులంలో ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌!

ఏర్పాట్లు పూర్తి

విద్యార్థులు పరీక్షలు సౌకర్యవంతంగా రాసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నాం. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తాం. అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుంటూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

– జీజీకే నూకరాజు, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా శాఖ అధికారి, కాకినాడ

#Tags