Intermediate Board Exams: ఈసారి ఇంటర్‌ బోర్డు పరీక్షలకు సర్వం సిద్ధం..! విద్యార్థులకు సూచనలు..

మార్చిలో జరిగే ఇంటర్‌ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను పరిశీలించండి..

సాక్షి ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్‌ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను బుధవారం నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు.

Police Constable Training 2024- రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ, మొత్తం ఎంతమంది అంటే..

పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ను జోడించారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలోకి ఫోన్లను అనుమతించరు. పేపర్లను భద్రపరిచే పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఈసారి ఇంటర్‌ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్‌ ఫోన్‌ను మాత్రమే వినియోగించనున్నారు.

Intermediate Exams Time Table 2024- ఇంటర్‌ పరీక్షలు..నేటి నుంచి హాల్‌టికెట్ల జారీ

ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే ఉపయోగపడుతుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్‌ చేసేందుకు సాధ్యపడదు. పైగా ఈ ఫోన్‌ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.

APPSC group1 group2 Job for youth: యువతలో ఉద్యోగాల జోష్‌

ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు

ఈసారి ఇంటర్‌ బోర్డు పబ్లిక్‌ పరీక్షలకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది  ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్‌ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. దీంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాక్టికల్స్‌ పూర్తయిన వెంటనే మార్కులను  ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందుకోసం  ఇంటర్‌ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

TS DSC Notification 2024 : ఒక‌టి రెండు రోజుల్లోనే 11,000 ల‌కు పైగా టీచర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ఖాళీల వివ‌రాలు ఇవే..

ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్‌ రెండుసార్లు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్‌ పరీక్షలు మంగళవారం ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు సెంటర్లలో హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు.

Civils 2024 Notification: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్...

2022–23 విద్యా సంవత్సరంలో  ఇంటర్‌ రెండేళ్లు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు.  

SSC, Inter Public Exams Relaxation Tips For Stress : టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ పరీక్షలకు ఒత్తిడిగా ఫీలవుతున్నారా..? అయితే వీటికి దూరంగా ఉండండి..

పరీక్ష సమయంలో జాగ్రత్తలు:

- పరీక్షల సమయంలో విద్యార్థులు మరింత చురుగ్గా మెలగాలి.

- ఎటువంటి ఒత్తిడికి గురవకూడదు.

- విద్యార్థులు వారికి ఉన్న చిన్న సందేహాలైనా వారి ఉపాధ్యాయులను సంప్రదించి తీర్చుకోవాలి.

- ఆహారం, నిద్ర, వ్యాయామం వంటివి సమయానికి పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు.

-  పరీక్షకు చివరి నిమిషంలో మాత్రం చదవకూడాదు.

- పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి.

- ప్రశ్న పత్రం వచ్చిన వెంటనే కంగారుగా రాయడం ప్రారంభించవద్దు.. దానిని క్షుణ్ణంగా పరిశీలించండి. 

- ముందుగా మీకు పూర్తిగా తెలుసు అనుకున్న ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయండి.

- మీ తోటి విద్యార్థులు ఏం చేసినా పట్టించుకోవద్దు. 

- ఉపాధ్యాయులు మీకు ఇచ్చే ప్రతీ సూచనను గుర్తుపెట్టుకోండి.

- ఇచ్చిన గడువులోనే ప్రతీ ప్రశ్నకు సమాధానం రాయండి. 

- రాసే జవాబులు సరిగ్గా, అర్థమైయ్యేలా ఉండాలి. మీరు రాసే సమాధానం మాత్రమే కాదు, మీ చేతి రాత కూడా చక్కగా ఉండడం చాలా ముఖ్యం.

- పేపర్‌లో ఇచ్చే ప్రతీ సూచనను స్పష్టంగా చదవండి.

#Tags