DSC Candidates: డీఎస్‌సీ అర్హులకు నియామక పత్రాలు..

గతంలో జరిగిన డీఎస్‌సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించినట్లు డీఈఓ తెలిపారు.

ఏలూరు: 2008 డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు పొందని పలువురు అభ్యర్థులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ప్రాతిపదికన ఉద్యోగాల్లో నియమిస్తూ సోమవారం డీఈఓ సి.అబ్రహం నియామక పత్రాలు అందించారు. 2021 జూలైలో కొందరిని ఉద్యోగాల్లో నియమించగా, అప్పట్లో పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయిన మరో 18 మంది అర్హులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.

Job Interviews: 28న మార్గాని ఎస్టేట్‌లో జాబ్‌ మేళా

ఇద్దరు అభ్యర్థులు గైర్హాజరు కాగా మిగిలిన 16 మందికి పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ ఆర్‌.నరసింహరావు చేతులమీదుగా నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు తీసుకున్న అనంతరం గత డీఎస్సీల్లో అర్హులైన అభ్యర్థులకు సైతం ఎంటీఎస్‌ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలిచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. ఇలా జిల్లాలో సుమారు 600 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారన్నారు.

Telangana University: తెయూ అభివృద్ధికి కృషిచేయాలి.. విద్యార్థులకు స్టైఫండ్‌..

#Tags