Telangana University: తెయూ అభివృద్ధికి కృషిచేయాలి.. విద్యార్థులకు స్టైఫండ్..
తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఫిబ్రవరి 26న పీడీఎస్‌యూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థిసంఘాల నాయకులు శాసీ్త్రయ ధృక్పథాన్ని అలవర్చుకోవాలని వర్సిటీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు.
పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకు లు దత్తహరి, ప్రసాద్, దినేష్, సూరజ్, ప్రిన్స్, దేవిక, రవీందర్, అక్షయ్, బిందు, అనూష, ప్రవీణ, నవ్య, రాజేష్, నితిన్ పాల్గొన్నారు.
చదవండి: Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత
డిగ్రీ మెమోలు అందజేయాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు చదువు తూ మూడేళ్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే డిగ్రీ మెమోలు అందజేయాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం డిమాండ్ చేశారు. ఈమేరకు ఫిబ్రవరి 26న తెయూ రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. గ్రూప్ –1 నోటిఫికేషన్ విడుదలైనందున డిగ్రీ మెమో లు ఇస్తే వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు మహేష్, బానోత్ సాగర్ నాయక్, నవీన్, లక్ష్మణ్, వినయ్, నితీష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్టైఫండ్..
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలో న్యాయవిద్యను అ భ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి రూ.15వేలు స్టైఫండ్‌ను ప్రభుత్వం అందజేయాలని ఎస్‌ఎఫ్‌ఐ లా సబ్‌కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. హైద రాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర న్యాయ విద్యార్థుల కన్వెన్షన్ నిర్వహించారు. కా ర్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ న్యాయ విద్యార్థుల (లా) రాష్ట్ర కన్వీనర్‌గా తెయూకి చెందిన విద్యా ర్థి రాచకొండ విగ్నేష్ ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థుల సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో 11 తీర్మానాలను ఆమోదించామన్నారు.