AP DSC 2024 Notification Date : రేపే డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల...ఈ సారి కొత్త‌గా ఈ విధానంలో...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్ న‌వంబ‌ర్ 6వ తేదీన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. గ‌త వైఎస్సార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు క‌లిపి.. మొత్తం 16,347 నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

ఇలా ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే...?
డీఎస్సీ ఒక రోజు పేపరు ఈజీగా వచ్చిందని, మరో రోజు కష్టంగా వచ్చిందని అభ్యర్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 2 లేదా 3 జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఈ విధానంలో రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ పూర్తిగా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని ఆలోచిస్తున్నారు విద్యాశాఖ అధికారులు.

☛➤ AP DSC Bad News 2024 : ఇది మెగా డీఎస్సీ కాదు.. చోటా డీఎస్సీ మాత్ర‌మే... అభ్య‌ర్థుల‌ను దారుణంగా మోసం..!

ఇది మెగా డీఎస్సీ కాదని.. ఇది ద‌గా డీఎస్సీ అంటూ..
మ‌రో వైపు డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన‌ ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు.. మొద‌టి సంత‌కంతోనే.. నిరుద్యోగుల‌ను దారుణంగా మోసం చేశాడు అని అభ్య‌ర్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఇది మెగా డీఎస్సీ కాదని.. ఇది ద‌గా డీఎస్సీ అంటూ.. అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తున్నారు.

☛➤ APPSC Group 1, 2 Postpone 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1,2 మెయిన్స్ వాయిదా వేయండి... లేదా..?

#Tags