10th Class Exams: టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

గంగవరం : విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు అయిన టెన్త్‌లో మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అబ్షులాం ఆదేశించారు.

గురువారం స్థానిక గిరిజన సంక్షేమ బాలుర, బాలికోన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులతో మాట్లాడారు. వసతి గృహాల్లో సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు.రెండు ఉన్నత పాఠశాలల్లో రికార్డులను, పిల్లల, ఉపాధ్యాయుల హాజరును ఆయన పరిశీలించారు. పదో తరగతి పిల్లల పట్ల దృష్టి పెట్టాలని నూరుశాతం ఫలితాలు సాధనకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఝాన్సీహేన్సన్‌, సత్యనారాయణలు ఆశ్రమపాఠశాలల్లో సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పదోతరగతి పరీక్షా కేంద్రంలో సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. గంగవరం ఆశ్రమబాలికోన్నత పాఠశాలలో పరీక్షా గదులు గురించి వివరాలను హెచ్‌ఎం ఝాన్సీ హేన్సన్‌ డీడీకి వివరించారు. టేకులవీధి ఆశ్రమ పాఠశాలను డీడీ సందర్శించారు.

గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అబ్షులాం ఆదేశం

చదవండి: AP 10th Class Study Material

#Tags