Teachers Association: టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల హర్షం.. కారణం..?

పదో తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయని సిబ్బందులకు అభినందనలు తెలిపారు పలు అధికారులు. పరీక్ష, దానికి సంబంధించిన మూల్యాంకనం గురించి అధికారులు మాట్లాడారు..

ఏలూరు: ఏలూరు జిల్లాలో 2023–24 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపై వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు ఆర్‌.నరసింహారావు సారథ్యంలో డీఈఓ ఎస్‌.అబ్రహం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయడం అభినందనీయని పేర్కొన్నారు.

Exam Papers Evaluation: జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఏర్పాట్లు

పరీక్షలకు సౌకర్యాలు బాగునున్నాయని, అలాగే మూల్యాంకనాన్ని కూడా విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్‌, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పగడాల సాంబశివరావు, వడ్డమూడి రామ్మోహనరావు ఉన్నారు.

Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags