బోధనకు ఆటంకం కలగకుండా గెస్టు ఫ్యాకల్టీ

ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీగా ఉన్న సీఆర్టీలు, పీజీటీల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా గెస్టు ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తున్నామని సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు.
బోధనకు ఆటంకం కలగకుండా గెస్టు ఫ్యాకల్టీ

కేజీబీవీల్లోని సీఆర్టీలు, పీఈటీలు, పీజీటీల ఖాళీలను భర్తీ చేయాలని, రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియ చేపట్టాలని సమగ్ర శిక్ష అభియాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశమున్నందున.. ఈలోగా విద్యార్థుల బోధనకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గెస్టు ఫ్యాకల్టీని ఏర్పాటుచేయాలని ఆదేశాలిచ్చినట్లు నరసింహారావు వివరించారు. గెస్టు ఫ్యాకల్టీ కింద మహిళలనే తీసుకోవాలని, రిటైర్డ్‌ లెక్చరర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలను అర్హతల ప్రకారం ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) చైర్మన్ గా ఉండే కమిటీలు ఈ ఎంపిక ప్రక్రియ చేపడతాయని తెలిపారు. గెస్టు ఫ్యాకల్టీగా వచ్చే సీఆర్టీలకు గంటకు రూ.150 చొప్పున నెలకు 100 గంటలు మించకుండా గౌరవ భృతి చెల్లిస్తారని పేర్కొన్నారు. పీజీటీలకు గంటకు రూ.250 చొప్పున నెలకు 40 గంటలకు మించని విధంగా గౌరవ భృతి ఇస్తారన్నారు.

#Tags