Tenth Evaluation: పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభం.. ఎప్పుడు..?

ముగిసిన పదో తరగతి పరీక్షలు ఎంతో సజావుగా, నిబంధనల ప్రకారం జరిగాయి. అధికారులు సిబ్బందులు చేసిన ప్రణాళిక ప్రకారమే పరీక్షలు పూర్తయ్యాయి. అయితే, విద్యార్థుల జవాబు పత్రాలు ముల్యాంకనం చేసేందుకు సిద్ధమైన సిబ్బంది అందుకు తేదీని ప్రకటించారు..

అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకూ జరపనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని వేల్పులవీధి బాలికోన్నత పాఠశాల, గవరపాలెం చిన్నహైస్కూల్‌, మండలంలోని ఏఏంఏఏ హైస్కూళ్లలో మూల్యాంకనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Course and Employment: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులపై అవగాహన.. ప్రవేశ పరీక్షకు తేదీ..

వివిధ సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు చేరిన లక్షా 49 వేల 23 సమాధాన పత్రాల మూల్యాంకనానికి మూడు కేంద్రాల్లో 800 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

April 1st Holiday 2024 : గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 1వ తేదీన హలీడే.. కార‌ణం ఇదే..!

#Tags