NCET 2024 Notification: ఎన్‌సీఈటీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్మీడియట్‌తోనే బీఈడీలో ప్రవేశానికి అవకాశం..!

టీచర్‌ కొలువు సొంతం చేసుకోవాలని.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కోరుకునే వారు బీఈడీలో చేరతారు. కాని, ఈ ఒక్క మార్పుతో అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ పొందకుండానే చేరవచ్చు..

టీచర్‌ కొలువు సొంతం చేసుకోవాలని.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కోరుకునే వారు బీఈడీలో చేరతారు. సాధారణంగా బీఈడీలో చేరాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కాని ఇప్పుడు ఇంటర్మీడియెట్‌తోనే బీఈడీలో ప్రవేశం పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఆర్‌ఐఈలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ అందిస్తున్నాయి. దీనికి మార్గం.. నేషనల్‌ కామన్‌ ఎంట్రన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ)! ఇటీవల ఎన్‌సీఈటీ–2024కు నోటిఫికేషన్‌ వెలువడింది. 
ఈ నేపథ్యంలో.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ప్రత్యేకతలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ప్రవేశ పరీక్ష తదితర వివరాలు.. 

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని ప్రారంభించారు. వీటిలో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఎన్‌సీఈటీ (నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌). ప్రస్తుతం దేశంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రముఖ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు ఉపాధ్యాయ విద్యకు ప్రతిష్టాత్మకంగా భావించే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కూడా అందిస్తున్నాయి. వీటితోపాటు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ విద్యాçసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా ఈ కోర్సు అందించేందుకు సిద్ధమయ్యాయి. వీటన్నింటిలో ప్రవేశానికి అర్హత పరీక్ష ఎన్‌సీఈటీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. 

64 ఇన్‌స్టిట్యూట్స్‌.. 6,100 సీట్లు

  •      ఎన్‌సీఈటీ స్కోర్‌ ఆధారంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 ఇన్‌స్టిట్యూట్‌లు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో మొత్తం 6,100సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  •      తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణలో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ–బీఈడీ (50 సీట్లు), బీఎస్సీ–బీఈడీ (50 సీట్లు), బీకాం –బీఈడీ (50 సీట్లు); గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌–లక్సెట్టిపేట మంచిర్యాలలో బీఏ–బీఈడీలో 50 సీట్లు, నిట్‌–వరంగల్‌లో బీఎస్‌సీ–బీఈడీ (50 సీట్లు) ఉన్నాయి. 
  •      ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సంస్కృత విద్యాలయం–తిరుపతిలో.. బీఏ బీఈడీలో 50 సీట్లు; డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ –ఎచ్చెర్లలో బీఏ–బీఈడీలో 50 సీట్లు; బీఎస్సీ–బీఈడీలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

NHPC Apprentice Recruitment: వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తులు..

ఎన్‌ఐటీలు, ఐఐటీల్లోనూ
ఎన్‌సీఈటీ ద్వారా ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్స్‌లో.. సాంకేతిక విద్యకు కేరాఫ్‌గా భావించే ఎన్‌ఐటీలు, ఐఐటీలు కూడా ఉండడం విశేషం. ఎన్‌ఐటీ–కాలికట్, ఎన్‌ఐటీ–వరంగల్, ఎన్‌ఐటీ–పుదుచ్చేరి, ఎన్‌ఐటీ–అగర్త­ల, ఎన్‌ఐటీ–తిరుచిరాపల్లితోపాటు ఐఐటీ–భువనేశ్వర్, ఐఐటీ జోథ్‌పూర్, ఐఐటీ –రోపార్‌లలో బీఎస్సీ–బీఈడీ ప్రోగ్రామ్‌లో 50 సీట్లు చొప్పున అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు
ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ–బీఈడీ అభ్యర్థులు ఎంపీసీ గ్రూప్‌తో, బీకాం–బీఈడీ ఉత్తీర్ణులు సీఈసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

నాలుగు విభాగాల్లో.. ఎన్‌సీఈటీ
 నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎన్‌సీఈటీ పరీక్షను నాలుగు విభాగాల్లో నిర్వహించనున్నారు..
     విభాగం–1: ఈ విభాగంలో రెండు లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో లాంగ్వేజ్‌లో 23 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో అభ్యర్థులు 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎన్‌టీఏ పేర్కొన్న లాంగ్వేజ్‌లలో ఏవైనా రెండు లాంగ్వేజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
     విభాగం–2: డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌: 
ఈ విభాగంలో మొత్తం 26 డొమైన్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా మూడు డొమైన్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 28 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
     విభాగం–3: జనరల్‌ టెస్ట్‌: 
ఈ విభాగంలో 28 ప్రశ్నలు అడుగుతారు. 
25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
     విభాగం–4: టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌:

  •      ఈ విభాగంలో 23 ప్రశ్నలుంటాయి. 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 
  •      పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే  ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు
  •      మొత్తంగా అభ్యర్థులు 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
  •      ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది.ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

TS SSC Supplementary Exam Dates: జూన్‌ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

ప్రవేశాలకు ప్రత్యేక దరఖాస్తు

ఎన్‌సీఈటీ స్కోర్‌ ద్వారా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలనుకునే వారు.. సంబంధిత యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దశలో సదరు యూనివర్సిటీలు.. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థుల స్కోర్లను బేరీజు వేసి సీట్ల కేటాయింపు చేస్తాయి.

ముఖ్య సమాచారం
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 30
     ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: 2024, మే 2–4
     ఎన్‌సీఈటీ పరీక్ష తేదీ: 2024, జూన్‌ 12
     అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు నుంచి
     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nta.ac.in, https://ncet.samarth.ac.in 

IT Company: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఈ ఏడాది వేల మందికి శిక్షణ, ఉద్యోగాలు!!

#Tags