Kendriya Vidyalaya Admission 2024-25: నాణ్యమైన విద్యకు కేరాఫ్.. కేవీలు!
- 2024కు కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- 9వ తరగతి మినహా అన్ని తరగతుల్లో నేరుగా ప్రవేశం
- 9వ తరగతి ప్రవేశాలకు పరీక్ష నిర్వహణ
- చదువుతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
కేంద్రీయ విద్యాలయాలను ఆరు దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం సెంట్రల్ స్కూల్స్ పేరుతో వీటిని నెలకొ ల్పారు. ఆ తర్వాత సాధారణ పౌరుల పిల్లలకు కూడా ప్రవేశం కల్పించేలా నిబంధనలు మార్చారు. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన కేవీలను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనే ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేశారు.
లెర్నింగ్ బై డూయింగ్
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి +2(సీబీఎస్‌ఈ) వరకు బోధన అందిస్తున్నా రు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో.. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ బోధన సాగుతోంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కారణంగా విద్యార్థులు ఒక టో తరగతి నుంచే ఆయా అంశాలపై ఆసక్తిని పెంచు కునే అవకాశం ఉంటుంది. ఫలితంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
ఒకటో తరగతి.. లాటరీ విధానం
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీక రిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గరిష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖా స్తుల ఆధారంగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులను ఎంపిక చేస్తాయి.
తొమ్మిదో తరగతికి.. ప్రవేశ పరీక్ష
ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా విద్యార్థుల మెరిట్, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాని తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, సైన్స్‌లలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధి కారులు మెరిట్ జాబితా రూపొందించి.. కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు.
11, 12 నేరుగా ప్రవేశం
11వ తరగతి (సీబీఎస్‌ఈ +1), 12వ తరగతి (సీబీ ఎస్‌ఈ +2)లలో అందుబాటులో ఉన్న సీట్లకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఎలాంటి పరీక్ష ఉండదు. అదే విధంగా ఎలాంటి వయో పరిమితి నిబంధన కూడా లేదు. పదో తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే 11వ తరగతికి దరఖాస్తు చేసుకోవాలి. 11వ తరగతిలో బ్రేక్ లేని వారికి 12వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాల్లో.. ప్రాధాన్యతలు
- కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి.. విద్యార్ధుల తల్లిదండ్రుల వృత్తికి అనుగు ణంగా ప్రాధాన్యతనిస్తారు. అయిదు కేటగిరీలు గా వీటిని పరిగణిస్తారు.
- బదిలీౖయెన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు.
- కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ య్యర్ లెర్నింగ్ ఆఫ్ ది ఇండియన్ గవర్న్‌మెంట్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- బదిలీౖయెన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- పై కేటగిరీలకు చెందని, ఇతర వర్గాలకు చెందిన పిల్లలు.
ప్రాధాన్యత విధానం
ప్రవేశాల ఖరారు, ఎంపికలో ప్రాధాన్యత విధానా న్ని అమలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు /సీబీఎస్‌ఈలతోపాటు జాతీయ/ రాష్ట్ర స్థాయి క్రీడల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధా న్యం ఉంటుంది. స్పెషల్ ఆర్ట్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గా లకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. అదే విధంగా..పరమ్ వీర్ చక్ర, మహావీర్ చక్ర తదితర మెడల్స్ పొందిన ఉద్యోగుల పిల్లలకు, పోలీస్ మెడల్స్ పొందిన ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు.
చదవండి: Water Bell in AP Govt Schools: పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “Water Bell”
వయో పరిమితి ఇలా
- కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్దిష్ట వయో పరిమితులను నిర్దేశించారు. వీటిని నూతన విద్యా విధానానికి అనుగుణంగా నిర్ధారించారు. అవి..
- ఒకటో తరగతి: 6–8 ఏళ్లు u రెండో తరగతి: 7–9 ఏళ్లు u మూడో తరగతి: 8–10 ఏళ్లు u నాలుగో తరగతి: 8–10 ఏళ్లు u ఐదో తరగతి: 9–11 ఏళ్లు u ఆరో తరగతి: 10–12 ఏళ్లు u ఏడో తరగతి: 11–13 ఏళ్లు u ఎనిమిదో తరగతి: 12–14 ఏళ్లు u తొమ్మిదో తరగతి: 13–15 ఏళ్లు u పదో తరగతి: 14–16 ఏళ్లు ఉండాలి.
- ఎన్‌ఈపీ మార్గదర్శకాలను అనుసరించి 3, 4 తరగతులకు వయో పరిమితిని ఒకే విధంగా (8–10 ఏళ్లు)గా పేర్కొన్నారు. విద్యార్థులు 2024, మార్చి 31వ తేదీ నాటికి ఈ వయో శ్రేణుల మధ్యలో ఉండాలి.
బోధన వినూత్నం
కేవీల్లో వినూత్న విద్యా విధానం అమలవుతోంది. ముఖ్యంగా కొత్తగా చేరే పిల్లలు స్కూల్ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్’ను రూపొందించాయి. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన అనంతరం టీచర్లు విద్యార్థుల్లో పలు దృక్పథాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షిస్తారు. పరిసరాలను అర్థం చేసుకోవడం; ఆత్మవిశ్వాసం, పరిశీలన సామర్థ్యం, పరస్పర సంబంధాలు, వర్గీకరణ , ప్యాట్రన్‌లను అర్థం చేసుకొని అనుకరించగలగడం, భావ వ్యక్తీకరణ, అవగాహన, క్రియేటివ్ స్కిల్స్ పొందేలా బోధన ఉంటుంది.
ఫీజులు నామమాత్రం
కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజులు నామ మాత్రమ ని చెప్పొచ్చు. అడ్మిషన్ ఫీజు రూ.25. విద్యాలయ వికాస నిధి(రూ.500), ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర ఫీజులు ఉంటాయి. ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు అన్ని ఫీజులు కలిపి నెలకు రూ.500–600, ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1000 లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఒకటో తరగతి ప్రవేశ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 15
- 2వ తరగతి నుంచి(11వ తరగతి) ఆఫ్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 1 –10
- 11వ తరగతి ప్రవేశాలకు చివరి తేదీ: కేవీల్లో చదువుతున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా, కేవీల్లో చదవని విద్యార్థులు సీబీఎస్‌ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్‌లైన్ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవాలి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://kvsangathan.nic.in/admission/
చదవండి: Admissions In AP Model Schools: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల వెల్లువ