Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌

హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ..

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆపరేషన్‌ ఎమరాల్డ్‌లో భాగంగా ఉచితంగా లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కో­చింగ్‌ ఇవ్వనుంది. ఎంపికైన బాలబాలికలకు వేర్వేరుగా క్యాంపస్‌లలో ఉచిత లాంగ్‌టర్మ్‌ నీట్‌ కోచింగ్‌తో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
»    టీజీటీడబ్ల్యూఆర్‌ సంస్థలు: టీజీటీడబ్ల్యూ ఆర్‌జేసీ(పీవీటీజీ బాయ్స్‌) హయత్‌నగర్, టీజీటీడబ్ల్యూ ఆర్‌జేసీ(పీవీటీజీ గర్ల్స్‌) హయత్‌నగర్‌.
»    క్యాంపస్‌ల వారీగా సీట్ల సంఖ్య: పీవీటీజీ(బాయ్స్‌) హయత్‌నగర్‌: 50+25 బాలురు(ఎస్టీ+పీవీటీజీ); పీవీటీజీ(గర్ల్స్‌) హయత్‌నగర్‌: 50+25 బాలికలు(ఎస్టీ+పీవీటీజీ).
»    అర్హత: నీట్‌–2024 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్టీ కేటగిరీ బాలబాలికలు అర్హులు.
»    వార్షికాదాయం: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.­1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.­2,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు.
»    ఎంపిక విధానం: నీట్‌–2024లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.06.2024.
»    ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 27.06.2024.
»    సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేది: 29.06.2024.
»    తరగతుల ప్రారంభం: 01.07.2024.
»    వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in

17727 SSC CGL Jobs Notification 2024 Full Details : గుడ్‌న్యూస్‌.. 17,727 ఉద్యోగాల‌ భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags