UG and PG Course Admissions : కోయంబ‌త్తూర్‌లోని ఈ స్కూల్‌లో యూజీ, పీజీ స‌ర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కోయంబత్తూర్‌లోని కేంద్ర ప్రభుత్వ కళాశాల సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
     యూజీ కోర్సులు: బీఎస్సీ టెక్స్‌టైల్స్‌–మూడేళ్లు; బీఎస్సీ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌–మూడేళ్లు; బీబీఏ టెక్స్‌టైల్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌–మూడేళ్లు;బీఎస్సీ టెక్స్‌టైల్‌ అండ్‌ అపెరల్‌ డిజైల్‌–మూడేళ్లు/నాలుగేళ్లు. 
     అర్హత: కోర్సును అనుసరించి ఏదైనా విభాగంలో 10+2 ఉత్తీర్ణులవ్వాలి. లేదా సైన్స్‌ విభాగంలో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ లేదా బయాలజీ) పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. 
     పీజీ కోర్సులు: ఎంబీఏ–టెక్స్‌ౖటైల్‌ మేనేజ్‌మెంట్‌; ఎంబీఏ–అపెరల్‌ మేనేజ్‌మెంట్‌; ఎంబీఏ–రిౖటైల్‌ మేనేజ్‌మెంట్‌; ఎంబీఏ–టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌; ఎంబీఏ–టెక్స్‌టైల్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌.
     అర్హత: ఏదైనా విభాగం నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
     షార్ట్‌టర్మ్‌ సర్టిఫికేట్‌ కోర్సులు: మెడికల్‌ టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్, నాన్‌వోవెన్‌ టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఇన్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ. 
     కోర్సు వ్యవధి: 30 గంటలు.
     అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు టెక్స్‌టైల్, అనుబంధ విభాగాల్లో విద్యార్హత, పరిజ్ఞానం, పని అనుభవం కలిగి ఉండాలి.
     ఎంపిక విధానం: యూజీ కోర్సులకు హయ్యర్‌ సెకండరీ పరీక్ష మార్కులు, సీయూఈటీ యూజీ లేదా ఎస్వీపీఈటీ ప్రవేశ పరీక్ష ఆధారంగా, పీజీ కోర్సులకు సీయూఈటీ పీజీ/ఎస్వీపీఈటీ లేదా ఏదైనా ఇతర మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
     వెబ్‌సైట్‌: https://svpistm.ac.in

Ts Dsc Hall Tickets: అబ్బాయి హాల్‌ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్‌ టికెట్లలో గందరగోళం

#Tags