Aadhaar Card Download Process: సులువుగా డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

ఆధార్‌ కార్డు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.

ఎప్పుడైనా ఆధార్‌ కార్డు మరిచిపోతే దానికోసం ఇబ్బంది పడాలి. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా డిజిటల్‌ ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు.

సులువుగా డిజిటల్‌ ఆధార్‌ను పొందొచ్చు. పోస్టల్‌లో వచ్చినట్లుగానే దీనికి కూడా గుర్తింపు ఉంటుందని Unique Identification Authority of India (UIDAI) తెలిపింది. మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ (E-Aadhaar Card Download)  చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ Steps ఫాలో అవండి. ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడి ద్వారా ఈ-ఆధార్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..  

చదవండి: Good News for Employees: ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు

డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం

  • మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్   చేయండి.
  •  అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌ చేయాలి. (https://tathya.uidai.gov.in/access/login?role=resident)
  •  ఆధార్‌ కార్డు నెంబర్‌ ఇతరులకు తెలీకుండా ఉండేందుకు వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ప్రవేశ పెట్టిన  సంగతి తెలిసిందే. 12 అంకెల ఆధార్‌ నంబర్‌లో కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపించి.. దిగువ భాగంలో వర్చువల్‌ ఐడీ నంబర్‌ కనిపిస్తుంది. అందుకోసం కనిపిస్తున్న బాక్స్‌ను టిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. నంబర్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత Captcha కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌లోకి డిజిటల్‌ ఆధార్‌ కాపీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. 
  • అయితే, డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 
  • అది తెరవాలంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ అక్షరాల్లో ఆధార్‌ కార్డు ప్రకారం), పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

#Tags