Medical College: మెడికల్‌ కాలేజీని పరిశీలించిన డీఎంఈ

New Medical College

సిరిసిల్ల: జిల్లా మెడికల్‌ కాలేజీని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు బైపాస్‌ రోడ్డులో కొత్తగా నిర్మించిన మెడికల్‌ కాలేజీ భవనాన్ని తనిఖీ చేశారు. పెండింగ్‌ పనులను 15వ తేదీలోగా పూర్తిచేయాలని సూచించారు. వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాలికలు, బాలుర హాస్టల్‌ భవనాలను డీఎంఈ పరిశీలించారు. టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ దేవేందర్‌, డీఈఈ ఎస్వీ రమణ, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, మెడికల్‌ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

#Tags