Trending news: ఐటీ హబ్‌తో భవిష్యత్‌కు భరోసా

KTR

దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేటకు ఐటీ హబ్‌ రావడంతో ఇంజనీరింగ్‌ యువతకు భవిష్యత్‌ భరోసా లభించనుందని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరాజ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను సోమవారం రాష్ట విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన యువతకు ఇబ్బందులు లేకుండా, మహానగరంలో లభించే ఉద్యోగంతో సమానంగా మీ ఊరిలోనే ఐటీ కొలువులు కల్పించామన్నారు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో సూర్యాపేట ఒకటని ఐటీ హబ్‌కు మరికొన్ని కంపెనీలు రానున్నాయని తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని మంత్రి తెలిపారు. ఐటీ హబ్‌ ప్రారంభించిన అనంతరం ముందుగా మహాత్మాగాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికా యుగంధర్‌, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ ప్రియాంక, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌ కుమార్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, వైస్‌ చైర్మన్‌ పుట్టా కిషోర్‌, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

#Tags