Department of Commercial Taxes: జీఎస్టీ ట్రిబ్యునల్‌లో టెక్నికల్ మెంబర్ నియామకం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రెండో జీఎస్టీ అప్పిలెట్ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం నుంచి టెక్నికల్ మెంబర్ నియామకం కోసం వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
జీఎస్టీ చెల్లింపుల్లో తలెత్తే వివాదాలను పరిష్కరించడం కోసం విశాఖ, విజయవాడల్లో రెండు అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశా రు.
చదవండి: First President of GSTAT: జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా ప్రమాణ స్వీకారం..
రాష్ట్రంలో వ్యాట్, ఎస్‌జీఎస్టీ, ఆల్ ఇండియా సర్వీసెస్‌లో అడిషనల్ కమిషనర్ ఆపై స్థాయి ఉద్యోగులు ట్రిబ్యునల్ మెంబర్‌గా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
50 ఏళ్ల లోపు వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12 సా యంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేయాల్సిందిగా వాణిజ్యపన్నుల శాఖ తెలిపింది.
Published date : 17 May 2024 03:36PM