Skip to main content

PG, PG Diploma కోర్సులకు ప్రవేశ పరీక్ష

PG Diploma Courses
PG Diploma Courses

విజయనగరం అర్బన్‌: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల ను గురువారం వెల్లడించారు.

పీజీ ప్రొగ్రామ్‌ల కు దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలకు ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. అర్హులై న విద్యార్థులు ఈ నెల 22వ తేదీ రాత్రి 11.55 నిమిషాలలోపు రిజిస్టర్‌ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం యూనివ ర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ డెస్క్‌ ను లేదా, మొబైల్‌ నంబర్‌ 63004 43499ను యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులివే...

యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఏ ట్రైబల్‌ స్టడీస్‌, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లిష్‌, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌, ఎంబీఏ రెండేళ్ల పీజీ కోర్సును ఏర్పాటు చేశారు.

ఈ కోర్సునకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ పాలసీని అనుసరించి ప్రవేశ పరీక్ష మెరిట్‌ ఆధారంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రవేశాలు కల్పిస్తామని వీసీ తెలిపారు.

Published date : 17 May 2024 06:54PM

Photo Stories