Free Training in Digital Marketing: డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉచిత శిక్షణ

Free Training in Digital Marketing

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ (డిజిటల్‌ మార్కెటింగ్‌) కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) తమ కళాశాల సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్‌, డిప్లొమా, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలియజేశారు.

ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఫిబ్రవరి 2వ తేదిలోగా విద్యార్హతా పత్రాలు, ఆధార్‌ కార్డు, ఈ మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌తో విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇతర వివరాలకు 93477 79032, 80087 42842లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

#Tags