Free Coaching: గ్రూప్‌–2 పరీక్షకు ఉచిత శిక్షణ.. శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్ ఫ్రీ..

విజయనగరం అర్బన్‌: ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన తరగతులు నిర్వహించ‌నున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ సర్కిల్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ డైరెక్టర్‌ కె.సందీప్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోరుకునే అభ్యర్థుల నుంచి ఈ మేరకు దరఖాస్తులను మే 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు స్వీకరిస్తామ‌న్నారు. పరిమితమైన 60 సీట్లతో ఈ శిక్షణ తరగతులు ఈ నెల 27వ తేదీ నుంచి 50 రోజుల పాటు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేస్తామని వివరించారు. అభ్యర్ధులు డిగ్రీ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎంపికైన ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు రెండు దరఖాస్తుతో జతజేసి స్థానిక కస్పా స్కూల్‌లో ఉన్న స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 96 0355 7333, 91 7777 26454, 83 3096 7871 నంబర్లను సంప్రదించాల‌న్నారు.

 

Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ భారీగా ఉద్యోగాలు

#Tags