Skip to main content

Anganwadi Teachers Workers Salary news: అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్ల శాలరీ న్యూస్‌..!

Demand for higher wages for Anganwadi workers in Nalgonda  Anganwadi Teachers Workers Salary news   Anganwadi teachers and helpers protesting for wage increase in Nalgonda Town
Anganwadi Teachers Workers Salary news

నల్లగొండ టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు.

Anganwadi Teachers news: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అంగన్‌వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమతమ్మ, శాంతకుమారి, కోట్ల శోభ, శాంతబాయి, సాయి, సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి, రమణ, వనజ, విజయ, సరిత, స్వప్న, తారక, జయంతి, గంగమ్మ, జ్యోతి పాల్గొన్నారు.

Published date : 26 Jun 2024 03:53PM

Photo Stories