Skip to main content

Anganwadi Teachers news: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌

Anganwadi teachers divided into 7 batches for training  Training under Premwork 2022 syllabus  nganwadi news  CDPO Krishna Chaitanya guiding pre-primary education training
Anganwadi news

పెబ్బేరు రూరల్‌: జిల్లాకేంద్రంలో గురువారం వనపర్తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు నూతన సిలబస్‌లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యపై సీడీపీఓ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీబాయి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలో 230 మందిలో అంగన్‌వాడీ టీచర్లు ఉండగా 7 బ్యాచులుగా విభజించి ఒక్కో బ్యాచ్‌కు 3 రోజుల పాటు నూతన జాతీయ విద్యా విధానం ప్రేమ్‌వర్క్‌ 2022 ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

శిక్షణ తరగతులు ఈ నెల 28 వరకు కొనసాగుతాయని చెప్పారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఎస్‌ బీసీ శేఖర్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Published date : 22 Jun 2024 05:11PM

Photo Stories