Non-Teaching Posts in KGBV: కేజీబీవీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

బాపట్లఅర్బన్‌: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న కుక్స్‌, అసిస్టెంట్‌ కుక్స్‌, వాచ్‌ ఉమెన్‌, స్వీపర్‌ పోస్టులకు రోజువారి కింద 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, అవుట్‌సోర్సింగ్‌ కింద నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చేసే వరకు నెలకు రూ.7వేలు జీతంతో పనిచేసేందుకు జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఎం.చారులత గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు బాపట్లలో సమగ్ర శిక్ష కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు 7వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్‌, జనన ధ్రువీకరణ, క్యాస్ట్‌, రెసిడెంట్‌ సర్టిఫికెట్లు ఒరిజినల్స్‌తోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగుల అభ్యర్థులకు 52 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవచ్చన్నారు. దరఖాస్తులు జిల్లాలోని అన్ని కేజీబీవీ మండల విద్యా వనరుల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

చదవండి: Teacher Jobs: ఖాళీల్లో మూడో వంతే భర్తీ.. ఏడాది క్రితం లెక్క తేల్చిన ఖాళీలివీ..

#Tags