Anganwadis posts: అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Anganwadis jobs

చిలకలపూడి(మచిలీపట్నం)సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ పోస్టులు, సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎస్‌. సువర్ణ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో రెండు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, నాలుగు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 38 అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులు రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం ప్రాజెక్టుల పరిధిలో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సీడీపీవో ఆఫీసులో సంప్రదించి అక్టోబర్‌ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టులకు 21 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసు ఉండి, 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, వివాహితయై ఉండాలన్నారు. మిగిలిన వివరాల కోసం సంబంధిత ఐసీడీఎస్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

#Tags